health tips: ఈ పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి విషంతో సమానం.. తినకండి!!

డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినొచ్చా? తింటే ఏ పండ్లను తినాలి? ఎటువంటి పండ్లు తినకూడదు? డయాబెటిస్ అదుపులో ఉంచుకోవడానికి ఆహారం విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? అనే విషయాలను వైద్యులు చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వాళ్లు తమ సమతుల్య ఆహారంలో భాగంగా పండ్లను చేర్చాలని చాలామంది వైద్యులు సిఫార్సు చేస్తారు.

వైద్యులు చెప్పారని చాలా మంది అవగాహన లేకుండా ఏ పండ్లను పడితే ఆ పండ్లను కొనుగోలు చేసి తింటూ ఉంటారు. అయితే డయాబెటిస్ బారిన పడినవారు, డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారు కొన్ని పండ్లను తింటే మాత్రం అవి విషంతో సమానం అని చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

health tips

చక్కెర ఎక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదు. మనం తీసుకునే పండ్లలో చెక్కెర ఎక్కువ ఉంటే, అది రక్తంలో చక్కెరను మరింత పెంచి శరీరానికి హాని చేస్తుంది. కనుక డయాబెటిస్ బాధితులు చక్కెర ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్(GI) ఒక నిర్దిష్ట ఆహారం ఒక వ్యక్తి తిన్న తర్వాత రక్తంలో చక్కెరను ఎంత పెంచుతుందో చూపిస్తుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తినకూడదు.

డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు, పైనాపిల్స్, పుచ్చకాయలు, అరటి పండ్లు, లిచీ పండ్లు, ద్రాక్ష పండ్లు తీసుకోకూడదు. . డయాబెటిక్ పేషెంట్లు అరటి పండు తినాలనుకుంటే అరటి పండు సగం ముక్క మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఇది కూడా ఉదయం సమయంలో తింటేనే మంచిదని, పొరపాటున కూడా షుగర్ కంటెంట్ ఉన్న పండ్లను ముట్టుకోకూడదు అని చెబుతున్నారు.

డయాబెటిస్ బాధితులు ఖర్బూజా పండును కూడా తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. సీతాఫలాలు మధుమేహరోగులు తినకుండా ఉంటేనే మంచిదని సూచించబడింది. ఒకవేళ తినాలి అనుకుంటే మీడియం సైజు సీతాఫలాన్ని ఉదయం సమయంలో మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ బాధితులు ముఖ్యంగా ఈ పండ్లను తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+