health tips: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహరం తీసుకుంటే మంచిది?
ప్రతి నెలా మహిళలు మరియు అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. కొంతమందికి తలనొప్పి, వికారం, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే పీరియడ్స్ సమయంలో తీసుకునే కొన్ని ఆహారాలు ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు.
కాబట్టి పీరియడ్స్ సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల కొంతమేరకు ఆ సమయంలో కలిగే అనారోగ్యం నుండి బయటపడవచ్చు. పీరియడ్స్ సమయంలో ఎక్కువ నీటిని తాగాలి. ఎందుకంటే రుతుస్రావంలో పోయే రక్తంతోపాటు, నీరు కూడా బయటకు వెళ్లిపోతుంది.అందుకే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటం కోసం కచ్చితంగా నీటిని తాగాలి.

ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. చేపలు, మాంసం, గుడ్లు, ఖర్జూరాలు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. పీరియడ్స్ సమయంలో కొన్ని పండ్లను, కాయలను తింటే కూడా మంచిదని చెబుతున్నారు. పుచ్చకాయ, కీరా దోసకాయ, ఆపిల్ వంటి నీరు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు.
విటమిన్ సి ఉన్న పండ్లు కూడా పీరియడ్స్ టైం లో విపరీతంగా వచ్చే కడుపునొప్పి, నడుం నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి అని చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో పచ్చి కూరగాయలు తినడం చాలా ప్రయోజనకరమని అంటున్నారు.అంతేకాదు ఒక కప్పు అల్లం టీని పీరియడ్స్ సమయంలో తాగితే మంచిదని, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి లక్షణాలను తగ్గించడంలో అల్లం టీ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

పీరియడ్స్ సమయంలో ఆకుకూరలు తినటం కూడా మంచిదే. పీరియడ్స్ సమయంలో ఐరన్ లోపాన్ని నివారించడానికి డార్క్ చాక్లెట్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని,డార్క్ చాక్లెట్ లో ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ప్రతీరోజూ తీసుకునే ఆహారం కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే పీరియడ్స్ వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.












Click it and Unblock the Notifications