Health Tips: మధుమేహ బాధితులు వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది?

ప్రస్తుత సమాజంలో మధుమేహం ఒక అతిపెద్ద విపత్తుగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. క్రమబద్ధమైన జీవన శైలి లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో చాలామంది డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. మధుమేహం బారిన పడిన వారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా భవిష్యత్ లో వచ్చే ప్రమాదం ఉంది.

మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే ఏ సమయంలో వ్యాయామం చేస్తే మధుమేహ సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది అనేది కూడా తెలిసుంటే మధుమేహ బాధితులకు ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాయామం విషయానికి వస్తే కొందరు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. కొంతమంది యోగా చేస్తారు. ఉదయం సాధ్యం కాని వారు మధ్యాహ్నం, లేదంటే సాయంత్రం పూట వాకింగ్, యోగా వంటివి చేస్తూ ఉంటారు.

Health Tips: what time is better for diabetes sufferers to exercise?

అయితే మధుమేహ బాధితులు ఏ సమయంలో వ్యాయామం చేస్తే మంచిది? ఏ సమయంలో చేసే వ్యాయామం మధుమేహ బాధితులకు ఉపయోగకరంగా ఉంటుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు మధ్యాహ్న సమయంలో వ్యాయామం చేయటం ఉత్తమం అని తాజా పరిశోధనల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం వ్యాయామం చేసే వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించటం సులభమవుతుంది.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేస్తే రక్తంలో షుగర్ లెవల్స్ ను బాగా తగ్గిస్తుంది. సాయంత్రం వేళల్లో వ్యాయామం కంటే మధ్యాహ్న సమయంలో చేసే వ్యాయామం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక పగటిపూట వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించవచ్చని చెబుతున్నారు.

ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో మధుమేహం ఉన్న వారు ఉదయం, సాయంత్రం కంటే మధ్యాహ్నం వ్యాయామం చేస్తే బ్లడ్ షుగర్ బాగా కంట్రోల్ లో ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా మధ్యాహ్న సమయంలో వ్యాయామం చేస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+