health tips: ఏ ఆహారం కంటిచూపును మెరుగుపరుస్తుంది? తెలుసుకోండి!!
కళ్ళు.. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా చూడగలుగుతాం.. ఏదైనా చేయగలుగుతాం.. కాబట్టి కంటి ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయస్సు నుండే దృష్టి సమస్యలతో కళ్ళజోడు వాడాల్సిన పరిస్థితికి వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం. పోషకాహార లోపంతోనే ఎక్కువ మంది చూపు సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలోని కంటిచూపును మెరుగుపరిచే కొన్ని ఆహారాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కంటి చూపుని మెరుగుపరచడంలో చిలకడ దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి. ఇక రోజువారి ఆహారంలో మనం ఆకుకూరలను చేర్చుకోవడం కూడా కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఆకుపచ్చని పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తినటం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంతేకాదు ఉసిరికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఇక నారింజ, బత్తాయి కూడా కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఆకుకూరలు, పండ్లు విటమిన్ ఏ ఎక్కువగా ఉండేవి తినటం కళ్ళకు మేలు చేస్తుంది.
నేరేడు పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆహార పదార్థాలను, పళ్ళను ఎక్కువగా తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు కళ్ళ ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది అని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications