వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఈ డైట్ ప్లాన్‌తో వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ట్రై చెయ్యండి!!

విపరీతంగా బరువు పెరిగామని, బరువు తగ్గటానికి చాలామంది డైట్ ప్లాన్ మార్చుకుంటూ ఉంటారు. అయితే వారం రోజుల్లో బరువు తగ్గే డైట్ ప్లాన్ తో చాలా మంచి రిజల్ట్ ఉంటుందని అంటున్నారు న్యూట్రిషనిస్టులు

|
Google Oneindia TeluguNews

ఊబకాయం... ఇప్పుడు సమాజంలో అతిపెద్ద సమస్య. ఏమి తిన్నా తినకపోయినా విపరీతంగా ఒళ్ళు పెరుగుతుందని, బరువు పెరిగిపోతున్నామని బాధపడుతున్న వాళ్ళు తెగ పెరిగిపోయారు. రకరకాల డైట్ ప్లాన్లను ఫాలో చేస్తూ, అయినా బరువు తగ్గడం లేదని విసిగి వేసారి పోతున్నారు. వ్యాయామం చేసినా, ఆహార నియమాలు పాటించినా పెద్దగా బరువులో మార్పు రావడంలేదని తెగ బాధపడుతున్నారు. ఇక అటువంటి వారి కోసం ఈజీగా చేయగలిగిన వారం రోజుల్లో మంచి ఫలితం ఉండే డైట్ ప్లాన్ అందిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ లు.

బరువు తగ్గటానికి వారం రోజుల డైట్ ప్లాన్

బరువు తగ్గటానికి వారం రోజుల డైట్ ప్లాన్

ఇక ఆ డైట్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. వారం రోజుల్లో బరువు తగ్గాలని భావించేవారు మొదటిరోజు పుచ్చకాయ ముక్కలను, కీరా దోసకాయలను తినాలి. మొదటి రోజుకి పుచ్చకాయ ముక్కలు, కీర దోసకాయలే ఆహారం. ఇక వేరే ఏ ఆహారాన్ని ఆరోజు తీసుకోకూడదు. కడుపుకు సరిపడినంత పుచ్చకాయ ముక్కలను, కీర దోసకాయలను తినాలి. రెండవ రోజు బ్రేక్ ఫాస్ట్ గా ఉడికించిన కూరగాయలను తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం భోజనం కింద కూడా ఉడికించిన కూరగాయలను కాస్త పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. రెండవ రోజు కూడా ఎటువంటి ఇతర ఆహారాలను తీసుకోకూడదు.

పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్

పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్

ఇక మూడవరోజు డైట్ విషయానికి వస్తే మూడవరోజు పండ్లు, కూరగాయలు తినాలి. అయితే పండ్లలో పొరపాటున కూడా అరటిపండును తినకూడదు. అలాగే కూరగాయలలో ఆలుగడ్డలు తినకూడదు. మిగతా అన్ని పండ్లు, కూరగాయలు మూడవ రోజు డైట్ లో భాగంగా తీసుకోవాలి. కడుపునిండా పండ్లు, పచ్చి కూరగాయ ముక్కలు, లేదా ఉడికించిన కూరగాయ ముక్కలు మూడవరోజు ఆహారంగా తీసుకోవాలి.

అన్నం తిన్నా కప్పు మాత్రమే ..

అన్నం తిన్నా కప్పు మాత్రమే ..


ఇక నాలుగో రోజు డైట్ విషయానికి వస్తే నాలుగవ రోజు వేరే ఏ కూరగాయలు, పండ్లు తీసుకోకూడదు. ఒక్క అరటి పండ్లు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రిలోపు ఏడు నుంచి ఎనిమిది అరటి పండ్లను, మూడు గ్లాసుల పాలను మాత్రమే నాలుగవ రోజు ఆహారంగా తీసుకోవాలి. అంతకుమించి మరే ఇతర పదార్థాలను తినకూడదు.ఇక ఐదవ రోజు డైట్ విషయానికి వస్తే ఒక కప్పు అన్నం, ఆరు టమాటాలను ఆహారంగా తీసుకోవాలి. ఆరు టమాటాలను ఉడికించి పెప్పర్, సాల్ట్ వేసి అన్నంలో కలుపుకుని తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇంక వేరే ఏ ఇతర ఆహార పదార్థాలను ఐదవ రోజు డైట్ లో తీసుకోకూడదు.

ఏడు రోజుల డైట్ ప్లాన్.. ఇతర అనారోగ్యాలు ఉంటే జాగ్రత్త

ఏడు రోజుల డైట్ ప్లాన్.. ఇతర అనారోగ్యాలు ఉంటే జాగ్రత్త


ఇక ఆరవ రోజు డైట్ విషయానికి వస్తే, ఆరవ రోజు డైట్లో ఒక కప్పు అన్నాన్ని, కూరగాయలను తీసుకోవాలి. అంతకుమించి వేరే ఏ ఇతర ఆహార పదార్థాలను తినకూడదు. ఏడవ రోజు డైట్ లో ఒక కప్పు అన్నాన్ని, పళ్ళ రసాన్ని తీసుకోవాలి. ఇలా ఏడు రోజులపాటు సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకొని డైట్ ప్లాన్ ను ఫాలో చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు. అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు న్యూట్రిషనిస్టులు, వైద్యులు సలహాలు మేరకు ఈ డైట్ ప్లాన్ ను ఫాలో చేస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: పక్షవాతం ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి!!health tips: పక్షవాతం ఎందుకు వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి!!

English summary
Those who want to lose weight can lose weight in a week with this diet plan.. Try it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X