గుండెపోటు అకస్మాత్తుగా రాదు! ఈ 8 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Heart Attack: ప్రపంచవ్యాప్తంగా నేటికీ మరణాలకు ప్రధాన కారణంగా ఉన్నది మరేంటో కాదు.. గుండె జబ్బులు లేదా గుండెపోటు(Heart Attack). ప్రతి ఏడాది దాదాపు 1.79 కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే చాలా మంది గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని, ముందుగా ఎలాంటి సంకేతాలు ఇవ్వదని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. దక్షిణ కొరియా, అమెరికా పరిశోధకులు జరిపిన తాజా రీసెర్చ్ ప్రకారం.. గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చిన వ్యక్తులలో దాదాపు 99 శాతం మందిలో సంవత్సరాల ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించాయి. అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ లేదా పొగతాగే అలవాటు వంటి రూపంలో ఈ సంకేతాలు బయటపడతాయి. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించి, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె జబ్బులను సూచించే 8 ముఖ్య సంకేతాలు ఇవే..
గుండె సంబంధిత వ్యాధులు నెమ్మదిగా, నిశ్శబ్దంగా పెరుగుతాయి. తొలి దశలో కనిపించే కొన్ని లక్షణాలు చిన్నవిగా లేదా సంబంధం లేనివిగా అనిపించవచ్చు. అందుకే చాలా మంది వాటిని విస్మరిస్తారు. కానీ ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేమిటంటే:

*నిరంతర అలసట లేదా శక్తి లేకపోవడం: చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం.
*చిన్న పనులు చేసినా శ్వాస ఆడకపోవడం: కొద్ది దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా ఆయాసం రావడం.
*క్రమరహిత గుండె చప్పుడు: గుండె దడదడలాడటం లేదా లయ తప్పినట్లు అనిపించడం.
*పదేపదే గుండెల్లో మంట: లేదా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.
*అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్.
నడుస్తున్నప్పుడు కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి.
*దవడ, చేయి లేదా ఛాతీలో బిగుతుగా అనిపించడం.
*అకస్మాత్తుగా చెమట పట్టడం లేదా కారణం లేకుండా ఆందోళనగా అనిపించడం.

Heart Attack 8 Warning Signs You Should Never Ignore

పరిశోధన ఏం చెబుతోంది?
పరిశోధకులు 90 లక్షలకు పైగా దక్షిణ కొరియన్లు, వేలాది మంది అమెరికన్లపై 20 ఏళ్లుగా అధ్యయనం చేశారు. గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె సంబంధిత తీవ్రమైన సమస్య రాకముందు దాదాపు ప్రతి ఒక్కరిలో కనీసం ఒక సంకేతమైనా ఉండేదని కనుగొన్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా బ్లడ్ షుగర్‌లో స్వల్ప పెరుగుదల కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఫిలిప్ గ్రీన్‌ల్యాండ్ ప్రకారం, ఈ స్వల్ప మార్పులను కూడా సీరియస్‌గా తీసుకోవాలి. సరైన జీవనశైలి, చికిత్సతో ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

గుండెపోటుకు ప్రధాన కారణాలు ఏమిటి?
గుండె జబ్బులు లేదా గుండెపోటు కేవలం ఒక్క కారణం వల్ల రాదు. ఇవి కాలక్రమేణా అనేక కారణాలు కలవడం వల్ల వస్తాయి.
*పొగతాగడం లేదా పొగకు గురికావడం.
*ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం.
*ఎక్కువగా వేయించిన లేదా తీపి పదార్థాలు తీసుకోవడం.
*అధిక రక్తపోటు లేదా చక్కెర స్థాయిలు.
*నిరంతర ఒత్తిడి, ఆందోళన లేదా సరిగా నిద్ర లేకపోవడం.

ఈ కారణాలలో ఏ ఒక్కటి ఉన్నా మీ ధమనులకు నష్టం జరగడం మొదలవుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాలు కలిసినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.

గుండెపోటు రాకుండా నివారించడం ఎలా?
గుండెపోటు, స్ట్రోక్‌లు అకస్మాత్తుగా కాకుండా నెమ్మదిగా వచ్చే మార్పుల ఫలితమని ఈ పరిశోధన స్పష్టం చేసింది. వీటిని సకాలంలో గుర్తించి సరిదిద్దుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నా కూడా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. మీ రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం ప్రాణాలను కాపాడుతుంది. దీనితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా వృద్ధాప్యం వరకు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+