health tips: గుండెపోటు వచ్చేముందు హెచ్చరిక ఇలా; ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!!
గుండెపోటు అకస్మాత్తుగా రాదు.. ఈ లక్షణాలతో మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది. ఆ లక్షణాలు తెలుసుకుని జాగ్రత్త పడండి.
ఇటీవల కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు చేరిపోతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారు పెరిగిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న, ప్రతిరోజు వ్యాయామం చేసే యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెపోటు వచ్చే ముందు ఏవైనా లక్షణాలు కనిపిస్తాయా? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గుండె పోటు రావటానికి కారణాలు ఇవే
అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, వ్యసనాల వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాలు సరిగ్గా లేకపోయినా, రక్తనాళాలలో బ్లాక్లు ఏర్పడిన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారికి, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి, మధుమేహ బాధితులకు, మద్యం, పొగ తాగే వాళ్లకు, ఊబకాయం ఉన్నవాళ్లకు, శారీరక వ్యాయామం లేని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే
ఇక గుండెపోటు వచ్చే వారిలో కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. వాటిని గుర్తించడం చాలా అవసరం. తరచుగా చాతినొప్పి వస్తున్నా, గుండెలో బరువుగా అనిపిస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చాలామంది గుండె నొప్పిని గుర్తించలేరు. గుండె నొప్పిని ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఎసిడిటీ తగ్గడం కోసం మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకపోతే కచ్చితంగా హృద్రోగనిపుణులకు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గుండెలో నొప్పిగా అనిపించినప్పుడు ఎక్కువగా చెమటలు పడతాయి. విపరీతమైన ఆయాసం వస్తుంది. ఇక ఈ లక్షణాలు ఉన్న వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకోవాలి.

ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు
అకస్మాత్తుగా ఒక్కసారిగా వాంతులు కావడం కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం విపరీతంగా కడుపునొప్పి రావడం, ఎడమ చెయ్యి లాగడం, భుజాలు నొప్పిగా ఉండడం, మెడ నొప్పి, వెన్నునొప్పి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను సూచిస్తాయని వేటిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. విపరీతంగా దవడలు నొప్పి పుడుతున్నా నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యాన్ని ఆరు నెలలకో సారి చెక్ చేయించుకోవాలి
ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె ఆరోగ్యాన్ని కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అప్పుడే తెలుస్తుంది. వెంటనే చికిత్స చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమస్య ప్రాణం మీదికి తెచ్చుకునేదాకా చూసి తీరా ప్రాణం మీదకు వచ్చిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే, ముందుగానే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications