రోజుకు ఎన్ని చ‌పాతీలు..ఎప్పుడు తినాలి..? ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు..!!

చపాతి ఒక సమయంలో ఉత్తరాది వారు ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం దక్షిణాది లోనూ అన్నం స్థానంలో చపాతీకి ప్రాధాన్యత పెరిగింది. చపాతీల ద్వారా బరువు తగ్గవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే, నిర్దేశిత పరిమితిలో.. సరైన సమయంలో చపాతీలను ఆహారంగా తీసు కుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చపాతీల ద్వారా కావాల్సిన పోషకాలు శరీరానికి అందు తాయని వైద్యులు చెబుతున్నారు. డయాబెటీస్ తో బాధ పడుతున్న వారికి ఇది మంచి ఆహారం. గుండెకు మంచి ఆహారంగా చెప్పుకునే ఈ చపాతీలను సరైన విధానంలో తీసుకుంటే అన్ని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

ఒక మీడియం సైజ్ చ‌పాతీ ద్వారా మ‌న‌కు సుమారుగా 100 క్యాల‌రీలు ల‌భిస్తాయి. అలాగే పిండి ప‌దార్థాలు 20 గ్రాములు, ప్రోటీన్లు 4 గ్రాములు, కొవ్వు 1 గ్రాము, ఫైబర్ 3 గ్రాములు ల‌భిస్తాయి. అన్నంను తీసుకుంటే అందులో పిండి ప‌దార్థాలు త‌ప్ప ఇత‌ర పోష‌కాలు ఉండ‌వు. క‌నుక‌నే రాత్రి పూట అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తినాల‌ని వైద్యులు కూడా సూచిస్తుంటారు. చ‌పాతీల్లో విట‌మిన్లు బి1, బి2, బి3, బి6, బి9, విట‌మిన్ ఇ, స్వ‌ల్ప మొత్తాల్లో విట‌మిన్ కె ఉంటుంది. చ‌పాతీల ద్వారా మ‌న‌కు ఐర‌న్ కూడా ల‌భిస్తుంది. దీంతో ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. చ‌పాతీల్లో మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, జింక్‌, క్యాల్షియం వంటి పోష‌కాలు కూడా ఉంటాయి. అయితే ఈ పోష‌కాలను పొందాలంటే చపాతీల‌ను నూనె లేకుండా కాల్చి తినాల‌ని, లేదంటే వీటిని కోల్పోతామ‌ని చెబుతున్నారు.

how-many-chapatis-to-eat-in-a-day-and-the-best-time-to-eat

చ‌పాతీల ద్వారా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు ల‌భించాలంటే వాటిని నూనె లేకుండా కాల్చి తినాల్సి ఉంటుంది. ఇక చ‌పాతీల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో పేగుల్లో ఆహారం లేదా మ‌లం క‌ద‌లిక స‌రిగ్గా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెర‌గ‌వు. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారికి చ‌పాతీలు ఎంతో మేలు చేస్తాయి. దీంతో డ‌యాబెటి స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. గోధుమ పిండిలో ఉండే పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల అనేక మిన‌ర‌ల్స్‌ను పొంద‌వ‌చ్చు. చ‌పాతీల‌ను రాత్రి పూట తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+