కూరలను ఎలా తింటే ఆరోగ్యం.. ఎంత తింటే ఆరోగ్యం.. తెలుసుకోండి!

సహజంగా భోజనంలో కూరలను తింటాం. ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజు కూరగాయలను, ఆకుకూరలను తినాలని చాలామంది చెబుతారు. కూరలలో మంచి పోషకాలు ఉంటాయని, వాటిని నిత్యం తినటం మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందని చెప్తారు. అయితే అటువంటి ఆకుకూరలు, కూరగాయలతో చేసిన కూరలను ఏ విధంగా వండుకోవాలి? ఎంత తినాలి? ఎలా తింటే ఆరోగ్యం వస్తుంది? మన శరీరానికి కావలసిన పోషకాలు వస్తాయి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కూరలను ఇలా తినాలి
కూరలను ఎప్పుడు పోషకాలు పోకుండా ఉడికించి తినాలి. బాగా ఎక్కువ సేపు కూరను ఉడికించిన దానికంటే కొద్దిసేపు ఉడికించి తిన్న కూరగాయల్లో పోషకాలు, విటమిన్లు కోల్పోకుండా ఉంటాయి. కూరలను చాలా తక్కువ నూనెతో వండుకుని తినాలి. ఎక్కువ ఉప్పు, ఎక్కువ మసాలాలు వినియోగించకుండా ఉంటే మంచిది. ఇక కూరగాయలలో పచ్చి కూరగాయలను కూడా తినడం చాలా మంచిది. వండిన వాటిలో కంటే పచ్చి వాటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి.

How much to eat curries How to eat them to stay healthy

కూరలతో శరీరానికి కావాల్సిన పోషకాలు
ప్రతిరోజు మనం మన శరీరానికి పోషకాలను ఇచ్చే ఆకుకూరలను, కూరగాయలను తినాలి. వీలైనంత ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఆహారం తినేటప్పుడు కూరలను ఎక్కువ తినాలి. ఒక కప్పు అన్నం పెట్టుకుంటే రెండు కప్పుల కూర పెట్టుకుని తినాలి. ఎక్కువ కూర తినడం వల్ల అందులో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి.

ఇలా కూరలను తినొద్దు.. మంచిది కాదు
కూరగాయలతో పాటు పండ్లు, చేపలు, గుడ్లు, పాలు, మాంసం వంటివి కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన సమతుల్య పోషకాలను అందిస్తుంది. ఎక్కువ నూనెతో వండిన కూరలను, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న కూరలను, చాలా ఎక్కువ సేపు ఉడికించిన కూరలను తినకూడదు. కనుక పైన పేర్కొన్న అంశాలను గుర్తుపెట్టుకొని కూరలను కూడా ఒక క్రమ పద్ధతిలో తింటే అది మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+