ఇంట్లో వైఫై ఉందా? ప్రెగ్నెన్సీ సమయంలో నెగ్లెక్ట్ చేస్తే తగిన మూల్యం తప్పకపోవచ్చు

ప్రెగ్నెన్సీ సమయంలో నిరంతరాయంగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తాయని గైనకాలజిస్టులు సూచిస్తోన్నారు. స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ తప్పనిసరిగా వినియోగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల కూడా పుట్టబోయే బిడ్డకు అనారోగ్య హేతువు అవుతుంని హెచ్చరిస్తోన్నారు. ఇంటర్నెట్ కోసం ఇంట్లో వైఫై వినియోగించడం కూడా అంత మంచిది కాదని స్పష్టం చేస్తోన్నారు. రాత్రంతా వైఫై ఆన్‌లో ఉండటం వల్ల అందులో నుంచి వెలువడే సిగ్నల్స్ ఇబ్బందులు కలిగిస్తాయని చెబుతున్నారు.

స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం కోసం వైఫై రూటర్లు, ఇతర వైర్‌లెస్ పరికరాలపై ఆధారపడుతుంటారు మహిళలు. ఇవి రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లను (RF-EMF) విడుదల చేస్తాయి. ఇవి నాన్-అయొనైజింగ్ రేడియేషన్లు. అంటే- ఎక్స్ రే లేదా సిటి స్కాన్‌ల మాదిరిగా డీఎన్ఏను నేరుగా దెబ్బతీసేంత శక్తి వీటికి ఉండదు. దీని తీవ్రత ఆ స్థాయిలో లేనప్పటికీ.. ప్రతి నిమిషం వైఫై ఆన్ లో ఉండటం వల్ల రిథమిక్ గా దాని తరంగాలు గర్భంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. పిండాన్ని ప్రభావితం చేస్తాయి. గర్భంలో బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు- ఈ రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌ ప్రభావం చూపుతుందనే వాదన ఉంది.

నియర్ ఫీల్డ్ ఎఫెక్ట్ అంటే.. ఫోన్ ను దగ్గర పెట్టుకోవడం, ఇయర్ ఫోన్స్/హెడ్ ఫోన్స్ ను పెట్టుకోవడం లేదా పొట్టపై ఫోన్ పెట్టుకోవడం వంటి చర్యలు ప్రత్యక్ష స్పర్శ కిందికి వస్తాయి. ఇది మరింత ప్రమాదానికి దారి తీస్తుంది. ఫార్-ఫీల్డ్: వైఫై రూటర్లు, సెల్ టవర్లు లేదా ఇతరుల పరికరాల నుండి వచ్చే సిగ్నలింగ్ ప్రభావం.

గర్భధారణ సమయంలో..

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు సహజం. తరచూ బ్లడ్ ప్రెషర్ లో హెచ్చతగ్గులు నమోదవుతుంటాయి. అలాంటప్పుడు వైఫై/మొబైల్/ఇంటర్నెట్ వినియోగం దీన్ని మరింత పెంచుతుంటుంది. పిండాన్ని బలహీనపరుస్తుంది. గర్భస్రావం ప్రమాదం: వైఫై వంటి ఇంటర్నెట్ పరికరాలు, పవర్ లైన్ల నుండి అధిక స్థాయి అయస్కాంత క్షేత్రాలకు గురైన మహిళల్లో గర్భస్రావం రేటు ఎక్కువ.

నిద్ర, ఒత్తిడి: నిద్రిస్తున్నప్పుడు పక్కనే మొబైల్ ఫోన్‌ ఉంచుకోవడం.. పరోక్షంగా పిండం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫోన్‌లను నేరుగా పొట్టపై పెట్టుకోవడం వల్ల పిండాన్ని రేడియేషన్‌ ప్రభావానికి మరింత చేరువ చేసినట్టవుతుంది. అలాగే- ఇయర్/ హెడ్ ఫోన్లను చెవికి పెట్టుకుని ఎక్కువసేపు ఫోన్ కాల్స్ మాట్లాడటం కూడా నియర్-ఫీల్డ్ ప్రభావాన్ని పెంచుతుంది.

ప్రెగెన్సీ సమయంలో వైఫై సిగ్నల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు.. అంటే ఐటి కార్యాలయాలు, కాల్ సెంటర్లు లేదా మల్టీ రూటర్లు ఉన్న క్లాస్ రూమ్ ల వంటి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. గర్భధారణ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈఎమ్ఎఫ్ రేంజ్ కు దూరంగా ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్టాండర్డ్ ప్రొటోకాల్ సైతం పేర్కొంటోంది.

అలాగని మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కు దూరం కావాల్సిన అవసరం లేదు. నియర్ ఫీల్డ్ ప్రభావాన్ని మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఫోన్‌ను చెవికి పట్టుకునే బదులు స్పీకర్ ఫోన్ ఉపయోగించండి. ఫోన్‌ను మీ కడుపుపై ఉంచవద్దు. నిద్రిస్తున్నప్పుడు మొబైల్ ను కనీసం 30 సెంటీ మీటర్ల దూరంలో ఉంచండి. దిండు కింద ఫోన్‌ను పెట్టవద్దు. రాత్రిపూట వైఫై రౌటర్లను ఆఫ్ చేయాలి. ఎక్కువ సేపు ఫోన్ మాట్లడకూడదు. దీనికి బదులుగా టెక్స్ట్ మీద ఆధారపడవచ్చు. ఇది ఎక్స్పోజర్ సమయాన్ని తగ్గిస్తుంది.

ఫోన్‌ వినియోగం తల్లిపాలు పట్టడం లేదా పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయా?

EMF ప్రభావం వల్ల తల్లిపాల ఉత్పత్తి తగ్గుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పాలిచ్చేటప్పుడు ఫోన్‌ల వల్ల మీద ఎక్కువగా ఆధారపడకూడదు. పాలిస్తూ ఫోన్ మాట్లాడకూడదు. 

నవజాత శిశువు చుట్టూ అన్ని పరికరాలను దూరంగా ఉంచాలా?

అవసరం లేదు. పూర్తిగా నివారించడం అవసరం లేదు. ఆడుకోవడానికి ఫోన్లు ఇవ్వకూడదు. వాటిని దగ్గరగా ఉంచకూడదు. బిడ్డ నిద్రపోయే ప్రదేశాలలో పెట్టవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+