చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇవి మర్చిపోకుండా తినండి
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. వ్యాయామం, ఇతర జీవనశైలి అలవాట్లను మార్చుకుని మన శరీరంలో కొలెస్ట్రాల్ ను కొంతమేర అదుపులో ఉంచుకోగలిగినప్పటికీ మనం ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే దీర్ఘకాలం కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం మనం ఎటువంటి ఆహారపదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పని చేసే ఆహారాలు
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే కొవ్వు పదార్థం. శరీరానికి పనిచేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం .అయితే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే అది మన గుండెకు చేటు చేస్తుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు మన శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయి. అందులో ముఖ్యమైనది పసుపు. పసుపులో కర్కుమిన్ సమృద్ధిగా ఉంటుంది.

ఈ పదార్ధాలతో కొలెస్ట్రాల్ కు చెక్
పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదం చేస్తుంది. మెంతులు.. కరగని ఫైబర్ ను కలిగి ఉండే మెంతులు మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా ఉపయోగపడే ఆహారాలలో వెల్లుల్లి మరొకటి. వెల్లుల్లి నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఇవి తినండి
ఇక పప్పులు, గింజలు మన శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బాదంపప్పు, ఆక్రోట్ మొదలైనవి హృదయ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.ఓట్స్ తినడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో బీటా గ్లూకోన్ అనే ఫైబర్ ఉండడం వల్ల అది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
వీటిని తిన్నా కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలను వారానికి రెండు సార్లు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అవకాడో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వాల్ నట్స్, వేరు శనగ, ఇతర గింజలు, సోయా బీన్స్, బెర్రీలు కూడా కొలెస్ట్రాల్ తగ్గటానికి దోహదం చేస్తాయి.












Click it and Unblock the Notifications