బెల్లం, ధనియాలు కలిపి తీసుకుంటే
మన పూర్వీకులు మనకన్నా ధృడంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కారణం వారు ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు. తన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఏ జీవినీ వేటాడలేదు.. ప్రకృతి ఇచ్చినవాటిని విధ్వంసం చేయలేదు. అంతేకాదు.. వారి వంటిల్లే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గా ఉండేది. వంటగదిలో దొరికే ఎన్నో పదార్థాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
అటువంటివాటిల్లో బెల్లం, ధనియాలు ముఖ్యమైనవి. సాధారణంగా అందరూ బెల్లంతోపాటు వేరుశనగ గుళ్లను కలిపి తీసుకుంటారు. బెల్లంతోపాటు ధనియాలు కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలుగా లభిస్తాయి. ఏవేంటనేది తెలుసుకుందాం.

* బెల్లం, ధనియాలు కలిపి తీసుకుంటే ఎముకలు పటిష్ఠంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గడంతోపాటు తిరిగి రావు.
* నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
* చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* కంటి చూపు మెరుగవుతుంది.
* మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
* బెల్లం, ధనియాలను ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి అరగంట ముందు తీసుకోవడంవల్ల మలబద్దకం తగ్గుతుంది.
* జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
* పొట్టకు సంబంధించి ఏ సమస్యలు రావు.
* రక్తహీనత, రక్తపోటు తో బాధపడేవారు బెల్లం, ధనియాలు కలిపి తీసుకుంటే అవన్నీ పరిష్కారమవుతాయి.
* శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.
* నాడీ మండల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుంది.
* హార్మోన్ల అసమతుల్య వంటి సమస్యలు తగ్గుతాయి.
* శ్వాస సంబంధిత సమస్యలు రావు.
* పావుటీ స్పూన్ బెల్లం తురుములో అరటీ స్పూన్ ధనియాల పొడిని కలిపి తీసుకోవాలి. ఏదైనా మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు












Click it and Unblock the Notifications