ఈ పండు షుగరు బాధితులకు వరం- గుండె సమస్యలు.. బీపీకి బ్రేక్..!!
నేరేడు పండ్లు. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న, ముదురు ఊదా రంగులో మెరిసిపోయే నేరేడు పండ్లు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఆయుర్వేదంలో నేరేడు పండును ఒక గొప్ప సర్వరోగ నివారిణిగా, ఔషధంగా పరిగణిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిల ను నియంత్రించడంలో నేరేడు పండు అద్భుతంగా పనిచేస్తుంది. బీపీ నియంత్రణ.. అజీర్ణ సమస్యలకు బ్రేక్ వేస్తుంది. నేరేడు పండు ప్రయోజనాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
నేరేడు పండు తినడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది మనం తినే ఆహారం లోని పిండిపదార్థం అంత త్వరగా చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది. ఈ పండు మాత్రమే కాదు.. నేరేడు గింజల పొడి కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది. అదే విధంగా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. నేరేడు పండులో ఫైబర్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి, కడుపు నొప్పి, విరేచనాల సమస్య నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నేరేడు పండులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి వేసవిలో సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండు సహజంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు
నేరేడు పండుతో శరీరంలోని విష తుల్యాలు బయటకు వెళ్లటం సులభంగా మారుతోంది. అదే విధంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, మరకలు మాయమై చర్మం కాంతివంతంగా మారు తుంది. నేరేడు పండులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది హై బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతే కాదు, నేరేడు పండులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఇది రక్తహీనతసమస్యను దూరం చేస్తుంది. దీనితో పాటు ఇందులోని విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. ఇలా.. నేరుడు పండు తినటం ద్వారా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.













Click it and Unblock the Notifications