ఈ జావ తీసుకుంటే క్యాన్సర్ దగ్గరకు రాదు- బీపీ కంట్రోల్, గుండె సేఫ్..!!
వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతోంది. శరీరానికి శక్తి మరింతగా అవసరం. ఈ సమయంలో చాలా మంది జావలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో రాగి.. జొన్న జావలతో మరింత శక్తి అందుతుంది. పూర్వకాలంలో చాలా వరకు జొన్నలను ఆహారంగా తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. రాగి జావను మించి జొన్న జావలో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జొన్న జావలో ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. జొన్నల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. జొన్నల్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు . జొన్నల్లో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. జొన్నలలో రెండు రకాలు ఉంటాయి. రెండింటిలో వేటిని తీసుకున్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జొన్నలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది.

ఆరోగ్య పరమైన ప్రయోజనాలు
జొన్నలను తీసుకోవటం ద్వారా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. వీటిని తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్లకు ఎంతగానో మేలు జరుగుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను జొన్నల్లో ఉండే సమ్మేళనాలు అడ్డుకుంటాయి. జొన్నలతో జావను తయారు చేసేందుకు గాను జొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకునొ ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించి తరువాత ఈ పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. ఇష్టమైతే పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా రోజూ జొన్నల జావను తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications