పచ్చి మామిడికాయ చారు: వేసవిలో శరీరానికి చలువ, ఆరోగ్యం!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు పచ్చి మామిడికాయతో చేసే చారు చాలా మంచిది. వేసవిలో పచ్చి మామిడికాయ చారు చాలా మంది చేస్తూ ఉంటారు. వేడి నుంచి ఉపశమనం కోసం చాలా కుటుంబాలు దీనిని ఇష్టంగా తీసుకుంటారు. పచ్చి మామిడి, ఉప్పు, మిరియాలను వేసి చేసే ఈ తేలికైన చారు పుల్లగా, చాలా మృదువుగా ఉంటుంది. దీనిని అన్నంతో పాటు లేదా పానీయంగా తీసుకోవచ్చు.
శరీరం చల్లగా ఉంచే మామిడికాయ చారు
శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ వంటకం సహాయపడుతుందని గృహిణులు చెబుతారు. పచ్చి మామిడి, నీరు, ఉప్పు హైడ్రేషన్‌కు తోడ్పడతాయి. ఈ చారు మన శరీరం కోల్పోయిన వాటిని తిరిగి తీసుకొస్తుంది. వేసవిలో వైద్యులు అధిక ద్రవాలు తీసుకోవాలని, బాడీ డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెప్తారు.

ఎండాకాలంలోనే చేసుకునే సీజనల్ చారు
కానీ ఈ చారు నీరు, మజ్జిగకు భిన్నమైన రుచినిస్తుంది.. పచ్చి మామిడికాయలు, మిరియాలు, కరివేపాకుతో చేసే ఈ చారు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఎండాకాలంలోనే చేసుకునే సీజనల్ చారు.మామిడికాయ చారు తయారు చేసే విధానం కచ్చితంగా తెలుసుకుని చేస్తే అది మంచి రుచిని ఇస్తుంది.
మామిడికాయ చారు తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయ - 1 (చిన్న ముక్కలు) , నీళ్లు - 3-4 కప్పులు, పచ్చిమిర్చి - 2-3, మిరియాల పొడి - 1/2 టీ స్పూన్, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ) - 1 స్పూన్
చారు ఇలా చేస్తే సూపర్ టేస్ట్
మామిడికాయ ముక్కలను, పచ్చిమిర్చిని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన మామిడికాయ గుజ్జును నుండి , రసాన్ని వేరు చెయ్యాలి .ఆపై ఈ చారులో ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు వేసి 5-10 నిమిషాలు మరిగించాలి . ఆపై చిన్న పాన్ లో నూనె/నెయ్యి వేసి తాలింపు గింజలు, ఇంగువ వేయించి చారులో కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి అన్నంతో సర్వ్ చెయ్యాలి.













Click it and Unblock the Notifications