వయసుతో పాటు జుట్టు సమస్య.. ఒత్తైన, అందమైన జుట్టు కావాలంటే ఇలా చెయ్యండి!
పొడవైన, ఒత్తైన జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు పొడవైన, ఒత్తయిన జుట్టు కావాలని కోరుకుంటారు. మనకు ఎక్కువ అందాన్ని ఇచ్చేది, చూసిన వాళ్ళను ఆకర్షించేది కూడా అందమైన ఒత్తయిన జుట్టు. అటువంటి జుట్టు విషయంలో ప్రస్తుతం చాలామంది తీవ్ర ఆందోళన పడుతున్నారు.
మధ్య వయస్సులో జుట్టు సంరక్షణా మార్గాలు
ముఖ్యంగా మధ్య వయసుకు వచ్చేసరికి తల మీద ఉన్న జుట్టు మొత్తం పల్చబడి పోతుందని, చూడడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జుట్టును సంరక్షించుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక అటువంటి వారి కోసం జుట్టును సంరక్షించు కొని ఒత్తుగా పెంచుకునే కొన్ని టిప్స్ ను ఇక్కడ తెలుసుకుందాం.

జుట్టు పెరగాలంటే ఇలా చెయ్యాలి
చాలామందిలో మధ్య వయసులో హార్మోన్ల మార్పులు, పోషక లోపాలతో జుట్టు రాలిపోతుంది. ఒత్తుగా పెరగడం కూడా ఆగిపోతుంది. అయితే ఇటువంటి వయసులో కొన్ని సహజ చిట్కాలను పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదల కోసం తలకు రక్త ప్రసరణను మెరుగుచేసే నూనెలను జుట్టుకు అప్లై చేయాలి. రోజ్ మేరీ పుదీనా వంటి నూనెలు, కొద్దిగా ఆముదంతో కలిపి రాస్తే జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తాయి.
పౌష్టికాహారంతో జుట్టు ఆరోగ్యం
జుట్టు ఒత్తుగానూ, ఆరోగ్యంగానూ పెరగాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకు కీలకంగా మారుతుంది. సాల్మన్ అక్రోట్ వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాలు జుట్టు ఆరోగ్యానికి మద్దతుని ఇస్తాయి. విటమిన్ ఎ, సి, డి, ఈ జుట్టు బలాన్ని పెంచడంలోనూ, జుట్టు నిగారింపును నిర్వహించడం లోనూ కీలకంగా పనిచేస్తాయి.
ఇలా చేస్తే కూడా ఒత్తుగా, ఆరోగ్యంగా జుట్టు
జుట్టు ఆరోగ్యం కోసం అలోవెరా ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది కుదుళ్ళను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అలోవెరా జెల్ ను నేరుగా తలకు రాసి ఓ గంట పాటు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక జుట్టు ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా తాకు మసాజ్ చేసుకోవడం మంచిది.
సహజ పద్దతులతో జుట్టు ఆరోగ్యం.. ట్రై చెయ్యండి
తలకు మసాజ్ చేసుకోవడం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, కుదుళ్లను ప్రేరేపించడానికి, ఒత్తిడిని నివారించడానికి దోహదం చేస్తుంది. ఈ సహజ పద్ధతులను దినచర్యలో భాగంగా చేసుకుంటే మధ్య వయసులో కూడా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.
-
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications