Cancer treatment: మీడియా మీటింగ్‌లో క్యాన్సర్ చికిత్స చెప్పేసిన మాజీ ఎంపీ.. ఆంకాలజిస్టులు ఫైర్

Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఇటీవల ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా తన భార్య క్యాన్సర్ చికిత్సపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపై వివాదం రాజుకుంది. పలువురు వైద్యులు సిద్దూ చెప్పిన మాటలను తప్పుపడుతున్నారు. అలా జరిగే ఛాన్స్ లేదంటూ బల్లగుద్ది చెబుతున్నారు.

క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో కీమోథెరపీ, సర్జరీ మరియు రేడియేషన్ లదే కీలక పాత్ర. దీని బారి నుంచి బయటపడటానికి ఇతర మ్యాజిక్ ఫార్ములాలు ఏవీ లేవని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. కానీ సిద్దూ మాత్రం తన భార్య ఆ ప్రాణాంతకమైన వ్యాధిని సమతుల ఆహారం ద్వారా జయించారని చెప్పడం వివాదానికి దారితీసింది. కేవలం సంచలనం సృష్టించడం మరియు ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ క్యాన్సర్ వైద్యులు నిందించారు.

Oncology specialists fired on ex MP Navjot Singh Sidhu

తన భార్య బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించేందుకు పాల ఉత్పత్తులతో పాటు చక్కెర తినకపోవడం ప్రధాన కారణమని సిద్దూ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా పసుపు మరియు వేపను ఎక్కువగా తినేదని, ఇది నయం చేయలేని క్యాన్సర్‌ను సైతం దూరం చేయడంలో సహాయపడిందని ప్రకటించారు. వైద్యులు ఆమెకు 5 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని వెల్లడించారు. అయినప్పటికీ సమతులిత ఆహారం మరియు జీవనశైలి అనుసరించడం ద్వారా స్టేజ్ 4 క్యాన్సర్‌ను అధిగమించిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేయబడ్డాయి.

ఈ వ్యాఖ్యలపై పలువురు వైద్యులు తీవ్రంగా స్పందించారు. 'కేవలం ఒక మ్యాజిక్ ఫార్ములా ద్వారా చికిత్స చేయడానికి క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి కాదు. క్యాన్సర్ కు సంబంధించిన ఉప రకం, నిర్దిష్ట క్యాన్సర్ కణాలలో జన్యు మార్పులు, మూల అవయవం, రోగనిర్ధారణ సమయంలో వ్యాధి వ్యాప్తి మరియు పరిధి సహా పలు కారకాల‌పై చికిత్స వ్యూహం ఆధారపడి ఉంటుంది' అని మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ చైర్మన్ డాక్టర్ హరిత్ చతుర్వేది తెలిపారు.

'డైట్ కంట్రోల్ లేదా డైట్ రీఏరేంజ్‌మెంట్‌లు, సహజ సిద్ధమైన పదార్థాలు తినడం వంటి మార్గాలు చికిత్సను భర్తీ చేయలేవు' అని మరో ఆంకాలజీ కన్సల్టెంట్ వెల్లడించారు. దేశంలో ఏటా 9 లక్షల మందికి పైగా ప్రాణాలను బలిగొంటున్న ఈ వ్యాధిపై ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా సమాజానికి హాని తలపెట్టారంటూ సిద్దూపై ఆంకాలజిస్టులు ఫైర్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+