జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా..?

ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమికి శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతోంది. ఇలాంటి వాతావరణంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. భానుడి భగభగలు మండిస్తుండడంతో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి.. వడదెబ్బ తగలదు' అంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన సలహా ఇటీవల చర్చనీయాంశమైంది. నిజంగానే ఉల్లిపాయను జేబులో పెట్టుకుని ఎండలోకి వెళితే హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చా.. ఈ అంశం పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. సహజంగానే ఉల్లిపాయ రసం శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది. కనుక వేసవిలో ఉల్లిపాయలు తింటే శరీరం చల్లగా ఉంటుంది. అయితే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు జేబులో ఉల్లిపాయలు పెట్టుకుని బయటకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. జేబులో ఉల్లిపాయ పెట్టుకో వడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయ లో కొన్ని సహజ గుణాలు ఉన్నాయనేది నిజం. ముఖ్యంగా ఉల్లిపాయను ఆహారంగా తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దాంతో కొంతవరకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మినరల్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడతాయి.

ఫలితాల ముందే విజయ్ కు బిగ్ ఆఫర్, కొత్త ఫార్ములా- TVK మద్దతు వారికే..!?
ఫలితాల ముందే విజయ్ కు బిగ్ ఆఫర్, కొత్త ఫార్ములా- TVK మద్దతు వారికే..!?
onions-have-cooling-properties-that-support-hydration-regulate-body-temperature-and-even-prevent-h

వేసవిలో జాగ్రత్తలు అవసరం

కాగా, ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం కన్నా, దాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. అయితే వడదెబ్బ నుంచి రక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వడదెబ్బ తగల కుండా చేయడమే కాదు వడదెబ్బకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకపోవడం మంచిది. తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, లేదా ఓఆర్‌ఎస్ (ORS) తాగాలి. దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తినాలి. ఆల్కహాల్, కెఫిన్ (కాఫీ, టీ), చక్కెర పానీయాలు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి, కాబట్టి వాటిని తగ్గించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+