ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రేవంత్ పై కేసీఆర్ కొత్త అస్త్రం, బిగ్ డెసిషన్.!!

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వరుస ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అందులో భాగంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్ధులను ప్రకటించిటంతో.. ఇదే సమయంలో సీఎం రేవంత్ లక్ష్యంగా కేసీఆర్ కొత్త అస్త్రాన్ని సంధించేందుకు సిద్దం అయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం కొనసాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయం ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. అందులో భాగంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నిక ల్లో అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా.. కేసీఆర్ పార్టీ ముఖ్యులతో మంత్రాంగం సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణీదేవి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి 'రెడ్డి' సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని, అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి 'బీసీ' అభ్యర్థిని బరిలో దింపాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
brs-steps-up-candidate-selection-for-two-graduate-mlc-seats-likely-to-finalize-names-soon

కేసీఆర్ కీలక మంత్రాంగం

వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతను అనుగుల రాకేష్ రెడ్డికి అప్పగించింది. ఇప్పటి కే క్షేత్ర స్థాయిలో ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు. కాగా.. రాకేష్ రెడ్డి గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం కోసం బీసీ అభ్యర్థిని పరిశీలిస్తోంది. కాసాని వీరేశ్ ముదిరాజ్, జి. నాగేందర్ గౌడ్, రవీందర్ యాదవ్ తదితరుల పేర్ రేసులో ఉన్నాయి. ఆయన ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్ట భద్రుల నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వికారాబాద్ కు చెందిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ జి. నాగేందర్ గౌడ్ పేరును కూడా పార్టీ పరిశీలిస్తోంది. కాంగ్రెస్ కు చెక్ పెట్టే విధంగా బీఆర్ఎస్ అభ్యర్ధుల పై కసరత్తు చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధులను కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+