రెస్టారెంట్ స్టైల్ "పనీర్ మసాలా కర్రీ".. ఇలా చేస్తే యమా టేస్ట్ ?

భారతీయ శాకాహార వంటకాల్లో పనీర్ (Paneer) ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనిని 'ఇండియన్ కాటేజ్ చీజ్' అని కూడా పిలుస్తారు. ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే పనీర్, ముఖ్యంగా మాంసాహారం తీసుకోని వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చే ఆహారం. పనీర్ ప్రత్యేకత ఏంటంటే.. దీనికి సొంతంగా బలమైన రుచి లేకపోయినా, మనం చేసే గ్రేవీ లేదా మసాలాల రుచిని పూర్తిగా పీల్చుకుని వంటకానికి ఒక అద్భుతమైన రూపాన్ని, రుచిని అందిస్తాయి.

అలానే పనీర్‌తో చేసే వంటకాల్లో 'పనీర్ బటర్ మసాలా', 'పాలక్ పనీర్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవే కాకుండా పచ్చి బఠానీలతో చేసే మటర్ పనీర్, కొంచెం స్పైసీగా ఉండే కడాయి పనీర్, షాహీ పనీర్ వంటి వంటకాలు విందు భోజనాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మెయిన్ కోర్స్ వంటకాలే కాకుండా పనీర్ స్టార్టర్స్, స్నాక్స్ రూపంలో కూడా విశేషంగా అలరిస్తుంది. రెస్టారెంట్ స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

paneer-masala-curry-making-recipe-in-telugu-with-easy-steps-and-tips-for-serving-also-better-taste

కావలసిన పదార్థాలు:

పన్నీర్ - 200 గ్రాములు (ముక్కలుగా కోసినవి)
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు - 2 (పేస్ట్ లేదా ప్యూరీ)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీడిపప్పు - 10-12 (నానబెట్టినవి)
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క
కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా - తగినంత
నూనె/వెన్న - తగినంత
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:

పన్నీర్ వేయించడం: బాణలిలో కొద్దిగా నూనె వేసి పన్నీర్ ముక్కలను తేలికగా వేయించి (గోల్డెన్ కలర్ వచ్చే వరకు) పక్కన పెట్టుకోవాలి (కావాలంటే పచ్చివి కూడా వాడొచ్చు).

మసాలా పేస్ట్: ఒక కడాయిలో నూనె/వెన్న వేసి, మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, లవంగాలు, మొదలైనవి) వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

టమాటా ప్యూరీ: ఇప్పుడు టమాటా పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

జీడిపప్పు పేస్ట్: జీడిపప్పును మెత్తగా నూరి, ఈ గ్రేవీలో కలపాలి, ఇది కర్రీకి చిక్కదనం, మంచి రుచిని ఇస్తుంది.

ఉడికించడం: కొద్దిగా నీరు పోసి గ్రేవీని ఉడికించి, ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలను, గరం మసాలా వేసి 5-7 నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి.

ముగింపు: చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి.

సూచనలు:

మరింత రుచి కోసం, చివరిలో కాస్త ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడను కలపవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+