పల్లీలను రెగ్యులర్ గా తీసుకుంటున్నారా - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
పల్లీలను మనం రెగ్యులర్ గా వినియోగిస్తాం. వంటకాల్లోనూ వాడకం ఎక్కువగా ఉంటుంది. మరి కొంత మంది పల్లీలను నేరుగా తినేందుకు ఇష్టపడతారు. పల్లీల్లో శరీరానికి శక్తి అందించే పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. పల్లీలను తినటం వలన ప్రయోజనాలు ఉన్నా.. తీసుకునే విధానం లో మాత్రం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
రోజూ ఒక కప్పు మోతాదులో పల్లీలను నీటిలో నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు చెబుతు న్నారు. ఈ కారణంగా వాటిల్లో ఉండే ఆరోగ్య కరమైన కొవ్వులు, ప్రొటీన్స్, విటమిన్లు బి3, బి9, బి1, బి6, బి5, ఇ, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల పల్లీలను రోజూ తింటే పోషకాహార లోపం ఏర్పడదు. శరీరానికి పోషణ లభిస్తుంది. పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల సులభం గా జీర్ణం అవుతాయి. పలు పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. పల్లీలను వేయిం చి తినకూడదు. పల్లీలలో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదపడతాయి. దీంతో శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

పల్లీలలో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె పనితీరు మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్ ఉన్నవారు పల్లీలను తింటుంటే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా రోజూ నీటిలో నానబెట్టిన పల్లీలను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్న వారు మాత్రం పల్లీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్ది మెత్తంలోనే తీసుకోవాలి. పరిమితి మించి తీసుకుంటే కొత్త సమస్యల బారిన పడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications