సమ్మర్ స్పెషల్ 'పెరుగు వడలు'.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..!
ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ సమ్మర్ లో శరీరానికి చలువ చేసేలా ఉండే ఆహారాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. పెరుగు, మజ్జిగను వేసవిలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పెరుగుతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా సూపర్ టేస్టీ పెరుగు వడలు ఎప్పుడైనా ట్రై చేశారా..? పెరుగు వడలను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం సూపర్ టేస్టీ దహీ వడను ఎలా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం..
పెరుగు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. వడ కోసం మినప్పప్పు ఒక కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి రెండు, అల్లం ఒక టీస్పూన్, నూన్ డీప్ ఫ్రైకు.. పెరుగు మిశ్రమం కోసం పెరుగు రెండు కప్పులు, ఉప్పు చిటికెడు, జీలకర్ర పొడి అర టీ స్పూన్, తాలింపు కోసం ఆవాలు అర టీ స్పూన్, ఎండు మిర్చి రెండు, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే ముందుగా మినప్పప్పు నానబెట్టుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు వేసి కలపాలి.

ఇప్పుడు ఆ పిండిని వడలుగా చేసి వేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు వడలను నీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇప్పుడు వడలను పెరుగులో వేసి బాగా ముంచాలి. ఆ తర్వాత తాళింపు వేసి సర్వ్ చేసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ పెరుగు వడ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications