Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డయాబెటిస్ బాధితులకు బిగ్ రిలీఫ్!

డయాబెటిస్ బాధితులకు భారీ శుభవార్త చెప్పింది కేంద్రం. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలలో భాగంగా జిఎస్టి సంస్కరణలను తీసుకువచ్చిన కేంద్రం ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తుంది. తాజా జిఎస్టి సంస్కరణల వల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడి మందులు కొనుగోలు చేయడం భారంగా మారిన ఎంతోమంది పేషెంట్లు ఉపశమనాన్ని పొందనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి జిఎస్టి సంస్కరణలలో భాగంగా ఈ మందుల ధరలు తగ్గనున్నాయి.

డయాబెటిస్ బాధితులకు బిగ్ రిలీఫ్
ముఖ్యంగా డయాబెటిస్ బారినపడి గ్లూకోమీటర్ లు, టెస్టింగ్ స్ట్రిప్ లు, మందులు కొనుగోలు చేయలేకపోతున్న వారు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో భారీ ఉపశమనాన్ని పొందబోతున్నారు. జిఎస్టి సంస్కరణల్లో భాగంగా గ్లూకోమీటర్ లు, డయాబెటిస్ మందులు వంటి అత్యవసర వైద్య పరికరాల పైన జీఎస్టీ రేటును 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. దీని వల్ల డయాబెటిస్ రోగులకు వైద్య ఖర్చులు తగ్గనున్నాయి.

PM Modi Diwali gift to diabetes patients with gst reforms rates reduced on medicines and equipment

Take a Poll

మోదీ దీపావళి కానుక
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్కరణలను దీపావళి బహుమతిగా ప్రజలకు అందించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉపశమనం పొందుతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 2030నాటికి ఈ సంఖ్య ఎనిమిది కోట్లకు పైగా చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

జీఎస్టీ తగ్గనున్న డయాబెటిస్ మందులు, వైద్య పరికరాలు
ఈ పరిస్థితులలో బాధితులకు ఉపయోగపడే గ్లూకోమీటర్ పైన జిఎస్టి తగ్గింపు నిర్ణయం రోగులపై ఆర్థిక భారాన్ని కాస్త తగ్గిస్తుంది. గ్లూకోమీటర్ లు, మందులు మాత్రమే కాకుండా టెస్ట్ స్ట్రిప్స్, ఇన్సులిన్ వంటి వాటిపైన కూడా జిఎస్టి తగ్గింపు ఉంటుంది .ఇది ప్రతి నెల తప్పనిసరిగా మందులు కొనుగోలు చేయాల్సిన డయాబెటిస్ పేషంట్స్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.

డయాబెటిస్ బాధితుల జీవన నాణ్యత పెంచే నిర్ణయం
జిఎస్టి చార్జీలు తగ్గించడంతో తక్కువ ఖర్చుతో ఉత్తమ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. మందుల పైన కూడా కాస్త భారం తగ్గడంతో కొనుగోలు చేయవచ్చు. కేంద్రం తీసుకున్న జిఎస్టి సంస్కరణల నిర్ణయం డయాబెటిస్ బాధితుల జీవన నాణ్యత మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్య రంగంలోని అత్యవసర ఉత్పత్తులపైన ఈ జీఎస్టీ సంస్కరణలలో పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రాధాన్యతను ఇవ్వటం ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సామాన్య ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి బిగ్ రిలీఫ్
కేవలం డయాబెటిస్ రోగులకు మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా జిఎస్టి తగ్గింపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. క్యాన్సర్ ఔషధాల పైన కూడా జిఎస్టి 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం, కొన్ని సందర్భాలలో జీరో శాతానికి తగ్గించటం ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ తాజా చర్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ప్రశంసించింది. ఇది పట్టణ ప్రాంతాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మెరుగైన వైద్య సేవలకు దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+