మట్టి కుండ నీళ్లతో ప్రయోజనాలు తెలిస్తే, ఫ్రిజ్ పక్కన పెట్టేస్తారు..!!
వేసవిలో ఎండలు పెరుగుతున్నాయి. శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి. గతంలో మట్టి కుండలలో నీటిని నిల్వ చేసుకు నేవారు. వేసవిలో వేడిని తగ్గించడానికి మట్టి కుండ నీరు ఎక్కువగా తాగేవారు. కానీ, ఇప్పుడు చల్ల దనం కోసం ఎక్కువ మంది ప్రిజ్ కు ప్రాధాన్యత ఇస్తారు. దీని వలన కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. అయితే, మట్టి కుండలోని నీటిని వేసవిలో తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు సహజమైన చల్లదనాన్ని, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనా లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీర pH స్థాయిలను సమతుల్యం చేయడం, సహజంగా మలినాలను తొలగించడం ద్వారా మెటబాలిజంను పెంచుతుంది. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. కుండకు ఉన్న పోరస్ స్వభావం నీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసి, నీటిని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా జలుబు చేస్తుంది. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే వారికి జలుబు రాదు. మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ దాగుంటుంది. ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తపడచ్చు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి.

కుండ నీటితో వేసవిలో ఎన్నో ప్రయోజనాలు
దీంతో పాటుగా జీర్ణ వ్యవస్థ బలంగా మారి, వేసవిలో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. చల్లటి నీటి కోసం ఫ్రిజ్, వాటర్ ఫ్యూరిఫైర్ వంటి ఎలక్రానిక్ వస్తువుల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం కంటే మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాగా.. ఫ్రిజ్ నీరు తాగడం సాధారణంగా సురక్షితమే అయినా, అతిగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది జీర్ణక్రియను మందగించడం, గొంతు సమస్యలు, జలుబు, శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పులు తీసుకురావడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాగా, బయట ఎండలో నుండి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నీరు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచన చేస్తున్నారు. చల్లటి నీటి కోసం ఫ్రిజ్, వాటర్ ఫ్యూరిఫైర్ వంటి ఎలక్రానిక్ వస్తువుల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం కంటే మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మొత్తానికి, వేసవిలో ఫ్రిజ్ నీరు కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications