రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!
పలు రకాల గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ప్రధానమైనవి గుమ్మడి గింజలు. వీటి లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు మొక్క ఆధారిత ప్రోటీన్ ను మనకు అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల వెన్నెముక బలంగా తయారవ్వడంతో పాటు కండరాల మరమ్మత్తు కూడా సక్రమంగా జరుగుతుంది. అయితే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా ఎవరు తినకూడదు వంటి విషయాలపై నిపుణలు స్పష్టత ఇస్తున్నారు.
గుమ్మడికాయ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషకాలను ఇచ్చే మంచి ఆహారం. ఇక గుమ్మడి గింజలను నేరుగా స్నాక్స్ గా తినవచ్చు. సలాడ్లలో కూడా వీటిని కలుపుకొని తీసుకోవచ్చు. ఇక సూప్ లలో కూడా గుమ్మడి గింజలు వేసుకొని తినవచ్చు. స్మూతీస్ లో కూడా గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గుమ్మడి గింజలలో సంవృద్దిగా ఉండే పోషకాలు ఇవే గుమ్మడి గింజలలో మోనో అన్ శాచ్యురేటెడ్, పాలి అన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్ గుమ్మడి గింజలలో లభిస్తాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, కాపర్ వంటి ఖనిజాలు గుమ్మడి గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడి గింజలు శరీరాన్ని ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.

ఆరోగ్యానికి ప్రయోజనాలు... వీరికి పరిమితం
ఇక ఇన్ని పోషకాలు ఉన్న గుమ్మడి గింజలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్, మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మంచి నిద్రకు ఉపకరిస్తుంది. గుమ్మడి గింజలు ఎక్కువ సేపు మన ఆకలిని తీర్చడానికి దోహదం చేస్తాయి. మన బరువును నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ కొవ్వులు కీళ్లను దృఢంగా చేయడంతో పాటు వాపు, నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. కనుక నడుము నొప్పితో బాధపడే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే గుమ్మడి గింజలను అలర్జీలు ఉన్నవారు, బీపీ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, కొన్ని రకాల మందులు వాడేవారు తీసుకోకూడదు.
-
US Drone: అమెరికాకు భారీ షాక్- హార్ముజ్ పై రూ.1850 కోట్ల డ్రోన్ మాయం..! -
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
వీటి బెనిఫిట్స్ వేరే లెవెల్ -
గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చక్కెర తీసుకోండి చాలు -
పరగడుపున నిమ్మరసం తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..!! -
మద్యం అలవాటు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, ఇలా ట్రై చేయండి..!! -
యంగ్ హీరో ఫేవరెట్ "దోసకాయ మటన్" ఇలా చేస్తే బెస్ట్ టేస్ట్..! -
ఈ వేసవిలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇది తినాల్సిందే..? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న!












Click it and Unblock the Notifications