పనస కాయ బిర్యానీ తింటున్నారా?
బిర్యానీలన్నీ సాధారణంగా నాన్ వెజ్ తో తయారవుతుంటాయి. వెజ్ బిర్యానీ చేసుకునేవారు కూడా ఉన్నారు. ఈ బిర్యానీలన్నీ ఒక ఎత్తయితే పనస కాయ బిర్యానీ మరో ఎత్తు. ఏపీ, తెలంగాణలో పనస కాయ బిర్యానీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదంటే మెడ కోసుకునేవారు కూడా ఉన్నారు. చాలా విభిన్నమైన బిర్యానీయేకాదు.. విభిన్నమైన రుచితో ఉంటుంది. తింటే అసలు వదిలిపెట్టరు. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
పనసకాయ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు

పనసకాయ ముక్కలు
బాస్మతి బియ్యం
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కొత్తిమీర
పుదీనా
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
జీలకర్ర
గరం మసాలా
పసుపు పొడి
కారం పొడి
ఉప్పు
నూనె
పెరుగు
నిమ్మరసం
తయారు చేసే విధానం
పనసకాయ ముక్కలను నూనెలో వేయించి, అదనపు నూనె తీసేయాలి. బాస్మతి బియ్యాన్ని నీరు, ఉప్పు వేసి ఉడికించి, నీరు పూర్తిగా తగ్గిన తర్వాత వడకట్టి చల్లబరచాలి. తర్వాత ఒక పాత్రలో నూనె వేసి వేడి చేసి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి వేగించిన తర్వాత వాటిలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికొంత సమయం వేయించాలి. పసుపు పొడి, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
వేయించిన పనసకాయ ముక్కలను, మసాలా మిశ్రమం, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఒక పాత్రలో బియ్యం, పనసకాయ మిశ్రమం పొరలు పొరలుగా అమర్చండి. తర్వాత వాటిపై మూత పెట్టి సన్నటి సెగ కాకుండా, పెద్ద సెగ కాకుండా ఉండే మంటపై 15-20 నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి సర్వ్ చేయండి.
చిట్కాలు
పనసకాయను కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి తర్వాత వేయించడం వల్ల మృదువుగా ఉంటుంది. బాస్మతి బియ్యాన్ని కొద్దిగా నీరు వేసి ఉడికించడం వల్ల బిర్యానీ మరింత రుచికరంగా వస్తుంది. దీంతోపాటు పెరుగు కూడా మరింత రుచిని ఇస్తుంది. బిర్యానీని చాలా మృదువుగా మారుస్తుంది. మీకు ఇష్టం ఉంటే దానిపై కేసరి వేసి అలంకరించుకోండి. బయట మార్కెట్ లో దొరుకుతుంది.












Click it and Unblock the Notifications