'గ్రీన్ టీ' పరిమితి మించితే ఎన్నో సమస్యలు - వీరు దూరంగా ఉండాలి..!!
గ్రీన్ టీ. ఈ మధ్య కాలంలో బాగా వినియోగం పెరిగింది. గ్రీన్ టీ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు తేల్చి చెప్పాయి. కాఫీ, టీకి ప్రత్యామ్నాయంగా అనేక మంది గ్రీన్ టీ వైపు మళ్లుతున్నారు. గ్రీన్ టీని పరిమితి మించి తాగితే అనేక సమస్యలు వస్తాయి. అదే విధంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీ అధిత మోతాదులో తీసుకుంటే కాలేయానికి నష్టం చేస్తుందని పరిశోధనల్లో గుర్తించారు.
కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్న వారు గ్రీన్ టీ తాగే ముందు డాక్టర్ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని National Institutes of Health అధ్యయనంలో పేర్కొంది. గ్రీన్ టీ అనేది ఐరన్ శోషణకు ఆటంకం కలిగించి.. మోతాదులో తీసుకోవడం వల్ల ఐరన్ లోపం రావడంతో పాటు అనీమియాకు దారితీస్తుందని చెబుతున్నారు. గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం శోషణ తగ్గిపోయి ఎముకలు బలహీనపడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుంది. గర్భిణులు అధిక మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల కొన్ని అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భవతులు గ్రీన్ టీ తాగే ముందు సంబంధిత డాక్టర్లును సంప్రదించడం మంచిదని పేర్కొన్నారు. గ్రీన్ టీ కొన్ని రకాల మందులతో పరస్పర చర్యలు జరపవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో, ఇలాంటి మందులు వాడుతున్నవారు గ్రీన్ టీ తాగే ముందు డాక్టర్లు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంతో ఉన్నవారు కూడా రోజుకు 2-3 కప్పులు మించి గ్రీన్ టీ తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే లేదా కొత్తగా గ్రీన్ టీ తాగడం మొదలుపెట్టాలని అనుకునేవారు సంబంధిత డాక్టర్లును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications