బియ్యం కడిగిన నీళ్ళతో చర్మ సౌందర్యమే కాదు ఆరోగ్యం కూడా.. పారబోయొద్దు!
ప్రతిరోజు మనం తప్పనిసరిగా వంట చేసుకుంటాం. దక్షిణాదిన ముఖ్యంగా అన్నం వండుకు తింటాం. ఈ అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దానిని ఉడికించి తింటాం. అయితే ఈ బియ్యాన్ని శుభ్రం చేయడానికి నీళ్లను పోసి కడిగిన తర్వాత ఆ నీటిని పారబోస్తాము. బియ్యం కడిగిన నీళ్లు నిరుపయోగమని భావిస్తాం. కానీ బియ్యం కడిగిన నీళ్లు ఎంతో ఉపయోగపడేవని వాటిలో ఎన్నో పోషకాలుంటాయని డైటీషియన్లు చెప్తున్నారు.
బియ్యం కడిగిన నీళ్ళతో ఆరోగ్య ప్రయోజనాలు
అన్నాన్ని వండడానికి ముందు మూడుసార్లు బియ్యాన్ని కడిగి నీటిని పారబోసే వారు ముఖ్యంగా ఈ విషయాలను తెలుసుకోవాలని చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్ళల్లో మినరల్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పొరపాటున కూడా బియ్యం కడిగిన నీళ్లను పారిపోయరు.

బియ్యం కడిగిన నీళ్ళతో చర్మ ఆరోగ్యం
బియ్యం కడిగిన నీళ్లు మన చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. బియ్యం కడిగిన నీటిలో కాటన్ లేదా శుభ్రమైన గుడ్డను ముంచి ముఖం పైన అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుంది. ఈ నీటిని స్కిన్ ఫేషియల్ గా కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. సహజంగా అందం కోసం కొరియన్స్ బియ్యం కడిగిన నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
బియ్యం కడిగిన నీళ్ళతో జుట్టు ఆరోగ్యం
ఇక బియ్యం కడిగిన నీళ్లు మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. బియ్యం కడిగిన నీళ్ళల్లో లావెండర్ ఆయిల్ ను కలిపి జుట్టును కడిగినట్లయితే మన జుట్టు బలోపేతం అవుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడం మాత్రమే కాకుండా విపరీతంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే పోషకాల కారణంగా అవి తాగినా మంచే జరుగుతుంది.
బియ్యం కడిగిన నీళ్ళతో బరువుకు చెక్
బియ్యం కడిగిన నీటిని తాగడం వల్ల కడుపులో మంట, విరోచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిలో కాస్త ఉప్పు, కాస్త నెయ్యి, కొంచెం మిరియాలపొడి కలుపుకొని తాగితే జీర్ణశక్తి మెరుగవుతుంది. బియ్యం కడిగిన నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే రైస్ వాటర్ ను పారబోస్తే నష్టం జరిగేది మనకే..
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications