ఈ వాటర్ అమృతంతో సమానం.. పొరపాటున కూడా పారబోయొద్దు!

మనం ఆరోగ్యం కోసం ఏవేంటో చేస్తుంటాం. ఎక్కడెక్కడికో వెళతాం. కానీ మన ఆరోగ్యం మన వంటగదిలోనే ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోతారు. మర్చిపోతారు అనేదానికన్నా గుర్తించరు అనడం సబబు. వంటలో రోజూ పప్పులను ఉపయోగిస్తాం. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని పారబోస్తాం. శుభ్రంగా కడిగిన పప్పులను వంటలో వాడతాం. శనగలైనా, బియ్యమైనా ఏదైనా కడిగిన నీటిని మాత్రం పారపోబస్తాం. కానీ ఆ నీరే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకరకంగా అది అమృతంతో సమానం.

బ్లడ్ షుగర్ నియంత్రణ : ప్రతిరోజు శనగలు కడిగిన నీరు తాగుతుండాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహ రోగులకు ఒకరకంగా ఇది వరప్రదాయిని అని చెప్పవచ్చు. షుగరుతోపాటు కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే శనగల నీటిని తాగుతుండాలి.

ricesoakedwater

మంచి జీర్ణ వ్యవస్థ : నానబెట్టిన శనగల నీటిని ప్రతిరోజు తీసుకోవడంవల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నానబెట్టిన శనగల నీటిలో ఫైబర్ ఉంటుంది. మలబద్దకం, అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

చర్మ సమస్యల నుండి : ప్రతిరోజు ఈ నీటిని తాగడంవల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి విముక్తులవుతారు. ముఖం మీద మొటిమలను తొలగిస్తాయి. మొటిమలు ఉంటే ప్రతిరోజు నానబెట్టిన శనగల నీటిని తాగుతుండాలి.

రక్త లోపాన్ని భర్తీ చేస్తుంది : కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, బి , మినరల్స్ వంటి పోషకాలు శనగల్లో ఉంటాయి. మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన శనగల నీటిని తాగితే రక్తహీనత తగ్గుతుంది.

బరువు తగ్గాలంటే : ప్రతిరోజు ఈ నీటిని తాగడంవల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేస్తాయి. శనగలను నానబెట్టినప్పుడు వాటిలో ఉండే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, పొటాషియం, విటమిన్లు నీటిలో కలిసిపోతాయి. కాబట్టి నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయనే విషయాన్ని తెలుసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+