కొబ్బరి నీళ్లు- చెరకు రసం: వేసవిలో ఎవరికి ఏది మంచిది..!!

వేసవి తీవ్రత క్రమేణా పెరుగుతోంది. ఎండ వేడి పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దీంతో.. ఆరోగ్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందు కోసం కొబ్బరి నీళ్లు.. చెరకు రసం వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా, వాటి ప్రయోజనాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అయితే, అసలు ఈ రెండు పానీయాల్లో వేసవి సమయంలో ఆరోగ్య పరంగా ఏది ఎక్కువ ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందిస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

వేసవిలో శరీరం త్వరగా నీరు కోల్పోతుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహజ పానీయాలు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, చెరకు రసం వేసవిలో ఎక్కువగా తీసుకునే పానీయాలు. కొబ్బరి నీళ్ళు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన, అత్యంత సహజమైన పానీయం. దీని అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇందులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుతాయి. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా పరిగణిస్తారు. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా చెరకు రసం సహజ శక్తిని ఇచ్చే పానీయం. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. కొన్ని ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. అయితే చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.

sugarcane-juice-it-has-more-vitamins-and-minerals-than-coconut-water-avoid-if-u-are-diabetic

నిపుణుల సూచనలు

చెరకు రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవిలో చెరకు రసంలో ఐస్‌ క్యూబ్స్‌ కలిపి తాగడం ఒక ప్రత్యేకమైన ఆనందం. చెరకు రసంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో, కామెర్లు వంటి వ్యాధులకు చెరకు రసం చాలా ప్రయోజనకరం. ఇందులో ఎముకలు, రక్తానికి మేలు చేసే కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ రెండు తీసుకునే సమయంలో శరీరంలో అప్పటికే ఉన్న సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని. శరీరం లో హైడ్రేషన్, ఆరోగ్యం, తేలికైన జీర్ణక్రియ కోసం చూస్తే కొబ్బరి నీళ్ళు మేలు చేస్తాయి. ఇది తక్కువ చక్కెర, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. వేసవిలో రోజూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బరి నీళ్లు ఉత్తమమైన ఎంపిక. చెరకు రసం కూడా మంచిదే కానీ పరిమితంగా, పరిశుభ్రమైన చోట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+