Sun stroke preventing drinks: వడదెబ్బ నుండి కాపాడుకునే సూపర్ డ్రింక్స్ ఇవే
వేసవికాలంలో ఎండలు మండుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. మే నెల ఆరంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు మరెంత దారుణ పరిస్థితి ఉంటుందో అన్న ఆందోళన నెలకొంది.
ఎండల తీవ్రత.. వడదెబ్బ ప్రమాదం
ఎండల తీవ్రత మాత్రమే కాదు అనేక జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రమాదం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో చాలామంది వడదెబ్బ బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి, ఎండగా ఉన్న సమయాలలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా కొన్ని రకాల పానీయాలు కూడా మనలను వడదెబ్బ నుండి కాపాడతాయి అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

హీట్ స్ట్రోక్ నుండి కాపాడే పానీయాలలో నిమ్మరసం ముఖ్యం
వడదెబ్బ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ సమస్యను నివారించడం కోసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. విటమిన్ సి గుణాలు పుష్కలంగా ఉండే నిమ్మరసం వడదెబ్బను నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా, హీట్ స్ట్రోక్ నుండి మనల్ని కాపాడుతుంది.
ఇవి తాగితే హీట్ స్ట్రోక్ నుండి ఉపశమనం
ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు కూడా ఒక అద్భుతమైన పానీయం. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ హీట్ స్ట్రోక్ సమస్యను నివారిస్తాయి. పెరుగుతో చేసే లస్సీ, అలాగే మజ్జిగ మనల్ని హీట్ స్ట్రోక్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఉల్లి, మామిడి తోనూ హీట్ స్ట్రోక్ నివారణ
వడదెబ్బ సమస్యను నివారించడంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసంలో కాస్త తేనె కలుపుకొని తాగితే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక పచ్చి మామిడికాయ తో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల శరీరానికి శక్తి మరియు ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. హీట్ స్ట్రోక్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడికాయ తో తయారు చేసిన జ్యూస్ ను తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications