అన్నం తినేటప్పుడు, తిన్న తర్వాత మంచినీరు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
మనిషి శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. ఆహారం లేకపోయినా జీవించవచ్చుకానీ నీరు లేకుండా జీవించలేం. అందుకే మంచినీటికి అంత ప్రాధాన్యత. ఇప్పటికీ మంచినీటి కోసమే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా నీటికోసమే యుద్ధాలు జరగబోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం ప్రతిరోజు 8 గ్లాసుల నీరు లేదంటే 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తాగుతుండాలని వైద్యులు చెబుతుంటారు. భోజనం చేసే సమయంలో ఎక్కువమంది మంచినీరు తాగుతుంటారు. అందులోను చాలా ఎక్కువగా తాగుతుంటారు. మరికొందరు తిన్న వెంటనే తాగుతారు. వాస్తవానికి ఇలా తాగకూడదు. ఈ రెండూ తప్పుడు నిర్ణయాలే. ఇలా తాగాలని ఏ వైద్యులు చెప్పేలేదు. తినేటప్పుడు, తిన్న తర్వాత మంచినీరు తాగడంవల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుంది?
జీర్ణక్రియ మందగిస్తుంది... నీరు జీర్ణరసాలను పలుచన చేస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పోషకాలు శోషణం తగ్గుతుంది... జీర్ణం సరిగా జరగకపోతే ఆహారంలోని పోషకాలు శరీరంలోకి సరిగ్గా అవసోషణ అవవు. కడుపు ఉబ్బరం, గ్యాస్... నీరు జీర్ణవ్యవస్థలోని వాయువులను పెంచి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎసిడిటీ... కొంతమందికి ఎసిడిటీ సమస్య మరింత తీవ్రమవుతుంది.

నీరు ఎప్పుడు తాగాలంటే?
భోజనానికి 30 నిమిషాల ముందు... భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత 30 నిమిషాల తర్వాత... భోజనం పూర్తయిన తర్వాత కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి. ఆ తర్వాతే నీరు తాగాలి. కొన్ని రకాల ఆహారాలను తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఎక్కువ సమస్యలు ఉండవు. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. చిన్న చిన్న సిప్స్ తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి శరీరం ఒకటి కాదు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఆ ప్రకారం మంచినీరు తీసుకోవాలి. అన్నం తినేటప్పుడు లేదా తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, పోషకాలు సరిగ్గా శోషణ అవ్వడానికి భోజనానికి ముందు లేదా తర్వాత కొంత సమయం తీసుకొని నీరు తాగడం మంచిది.












Click it and Unblock the Notifications