పొద్దు తిరుగుడు విత్త‌నాలతో ఇలా చేస్తే బీపీ, డ‌యాబెటిస్ కంట్రోల్..!!

పొద్దు తిరుగుడు విత్త‌నాలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నవి. చాలా మంది వీటిని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇవి మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వుల‌తోపాటు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మ‌న శ‌రీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. బీపీ త‌గ్గేలా చేస్తాయి.

పొద్దు తిరుగుడు విత్త‌నాలు టే మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. క‌ణాల నిర్మాణం స‌రిగ్గా జ‌రుగుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విత్త‌నాల్లో ఉండే మెగ్నిషియం గుండె వేగంగా కొట్టుకోవ‌డాన్ని త‌గ్గిస్తుంది. దీంతో హైబీపీ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. క్యాన్స‌ర్‌, గుండె పోటు వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ఈ విత్త‌నాల్లో జింక్‌, సెలీనియం, విట‌మిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఈ విత్త‌నాల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గేలా చేస్తుంది. నాన్ వెజ్ తిన‌ని వారికి ఈ విత్తనాల‌ను చ‌క్క‌ని ఆహారంగా చెప్ప‌వ‌చ్చు.

the-numerous-health-benefits-of-eating-sunflower-seeds-improves-heart-health

ఈ విత్త‌నాల‌ను తింటే ప్రోటీన్లు ల‌భించి శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. బ‌ద్ద‌కం పోతుంది. నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను గుప్పెడు మోతాదులో తిన‌వ‌చ్చు. అధికంగా తింటే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం, పొట్ట‌లో అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ విత్త‌నాల‌ను నేరుగా తింటే వికారంగా అనిపిస్తుంది. క‌నుక పెనంపై కాస్త వేయించి తింటే మంచిది. పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్‌లా తిన‌వ‌చ్చు. లేదా రాత్రి నిద్ర‌కు ముందు తిన‌వ‌చ్చు. ఉద‌యం వ్యాయామం చేసిన త‌రువాత కూడా తిన‌వ‌చ్చు. ఇలా ఈ విత్త‌నాల‌ను రోజూ తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+