టమాటా మిరియాల చారు.. వింటర్ లో దగ్గు, జలుబు ఏదైనా పరారు!
జలుబు, దగ్గు ఈ శీతాకాలంలో కామన్ గా వచ్చేటువంటి సీజనల్ సమస్యలు. మరి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఏది తిన్న నోటికి రుచించడం లేదని ఇబ్బంది పడతారు. అటువంటివారు ఈజీగా తయారు చేసుకునే టమాటా మిరియాల చారుని ఒకసారి ట్రై చేయండి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవడమే కాదు, నోటికి కూడా మంచి రుచిని ఇస్తుంది.
దీనిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
టమాటాలు - 4
చింతపండు- నిమ్మకాయంత
జీలకర్ర- 4 టేబుల్ స్పూన్లు
మిరియాలు - రెండు టేబుల్ స్పూన్లు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు- నాలుగు రెమ్మలు
పసుపు- హాఫ్ టీ స్పూన్
ఉప్పు- రెండు టీ స్పూన్లు
కారం- రెండు టీ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో యాడ్ చేయాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో అర టీ స్పూను పసుపు, రెండు టీ స్పూన్ల ఉప్పు, రెండు టీ స్పూన్ల కారం వేసి బాగా కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.
టమాటా చారు ఇలా
టమాట ముక్కలు కంప్లీట్ గా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఉడికిన టమాటాలలో పోయాలి. చారుకు తగ్గ చిక్కదనం చూసుకొని, దానినిబట్టి వాటర్ యాడ్ చేయాలి. ఇక మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను రోట్లో వేసుకొని దంచి పొడి కొట్టుకోవాలి. ఆ పొడిని చారులో యాడ్ చేయాలి.
సింపుల్ గా టమాటా మిరియాల చారు
ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. చారు బాగా మరిగి తెర్లుతుండగా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. ఇంత సింపుల్ గా టమాటా మిరియాల చారు ను తయారు చేసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, నోటికి ఏది రుచించడం లేదని ఫీలవుతున్న వారు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చారు చేసుకుని తింటే కచ్చితంగా రిలీఫ్ ని ఫీలవుతారు.












Click it and Unblock the Notifications