Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెండ.. వీరి ఆరోగ్యానికి హానికరం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. బెండకాయ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. బెండకాయ ఆరోగ్యానికి మంచిది కాదని దీని అర్థం కాదు గానీ.. ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ కే, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. వారిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలి. బెండకాయలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి బెండకాయలు పరోక్షంగా కారణమౌతాయి. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు లేదా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు కూడా బెండకాయ తినడం మానుకోవాలి. తప్పనిసరిగా తినాలనిపిస్తే తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. ఆ తర్వాత తగినంత నీళ్లు తాగాలి.

Ladyfingers are beneficial but may pose risks for certain health conditions

కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బెండకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు త్వరగా వస్తాయి. బెండకాయలో ఉండే ఆక్సలేట్‌లు యూరిక్ యాసిడ్ స్ఫటికీకరణను ప్రోత్సహిస్తాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను మరింత పెంచుతాయి. ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు బెండకాయకు దూరంగా ఉండటం మంచిది.

బెండకాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా జీర్ణక్రియకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లేదా జీర్ణశక్తి సమస్యలు ఉన్నవాళ్లు బెండకాయను తీసుకోవడం వల్ల ఆయా ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరం కావడానికి అవకాశం ఉంది. ఇది కడుపులో తిమ్మిర్లు, అజీర్ణానికి దారి తీస్తాయి.

రక్తం పలుచబరచే మందులు తీసుకునేవారు బెండకాయకు దూరంగా ఉండాలి. బెండకాయలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియకు విటమిన్ కే చాలా అవసరం. రక్తం పలుచబరచే మందులు తీసుకుంటున్నవారు తమ ఆహారంలో విటమిన్ కే పరిమాణాన్ని పరిమితం చేయాలి. ఈ సమయంలో బెండకాయను ఆహారంలో చేర్చుకుంటే మందుల ప్రభావం తగ్గుతుంది, ఇది రోగికి సమస్యలు సృష్టించవచ్చు.

ఇది కొంత విచిత్రంగానే ఉన్నప్పటికీ- శరీర రీత్యా ఇది కొందరికి పడదు. దీన్ని తినడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలర్జీ లక్షణాలలో దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. బెండకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పోషకాహార నిపుణులు బెండకాయను సరైన కూరగాయలతో, సమతుల్య పద్ధతిలో తినాలని సిఫార్సు చేస్తారు. ఉల్లిపాయలు, టమోటాలు లేదా బంగాళాదుంపలతో వండటం సురక్షితం, రుచికరంగా కూడా ఉంటుంది. పచ్చి బెండకాయలో అధిక కరిగే ఫైబర్ ఉన్నందున, ఎల్లప్పుడూ బాగా వండిన బెండకాయను తినాలి. పచ్చి బెండకాయ కొందరికి అజీర్తికి దారి తీయవచ్చు.

బెండకాయలను తక్కువ మసాలా, అలాగే పరిమిత నూనెతో వండాలి, తద్వారా దాని పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. డయాబెటిస్ లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని పగటిపూట తినడం మంచిది. రాత్రిపూట తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, పెరుగు లేదా మజ్జిగతో తినడం వల్ల జీర్ణక్రియకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Disclaimer: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు బెండకాయలను తినకూడదని సూచించడమే ఈ కథనం ఉద్దేశం. దీనికి సంబంధించిన పూర్తి సమచారాన్ని తెలుసుకోవడానికి డాక్టర్లను సంప్రదించగలరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+