వంకాయ ఎండు చేపల కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది!

ఎండు చేపల కూర.. మన ఇళ్ళలో చాలా మందికి ఇష్టం అయిన కూర. ఎండు చేపలు వాసన కాస్త ఇబ్బంది పెడుతుంది కానీ కూర రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎండు చేపలను టమాటాలు, దోసకాయలు, బీరకాయలు ఇలా రకరకాల కూరగాయలతో కలిపి వండి తింటారు. అయితే వంకాయ ఎండు చేపల కూర కూడా చాలా రుచిగా ఉంటుంది .

లేత వంకాయలు, ఎండు చేపల కాంబినేషన్‌తో చేసే ఈ కూర సరైన విధానంలో తయారు చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మరి ఎండుచేపలు, వంకాయ కూర ఎలా తయారు చెయ్యాలో చూద్దాం. ఒక్కసారి ఈ విధానంలో తయారు చేసి చూడండి.. మీరు కచ్చితంగా దీనిని వదిలిపెట్టరు.

vankaya endu chepalu curry Spicy Brinjal and Dry Fish Curry -make this curry in this process for better taste

కావాల్సిన పదార్ధాలు

వంకాయలు- పావు కిలో ,
ఎండు చేపలు - 20 ముక్కలు కట్ చేసుకున్నవి ,
పెద్ద ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగినది),
పచ్చి మిర్చి - 2,
నూనె - 2-3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు - తగినంత,
పసుపు - చిటికెడు,
కారం - 1.5 స్పూన్లు (రుచికి సరిపడా),
నీళ్లు - ఒక కప్పు,
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా వంకాయలను బాగా కడిగి, పురుగులు లేకుండా చూసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఉప్పు నీటిలో వేస్తే నల్లబడవు. ఎండు చేపలను వేడినీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల వాసన పోతుంది.స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఎండు చేపలు వేసి ఎర్రగా వేయించాలి.

ఉల్లిపాయలతో కలిపి వేయించడం వల్ల కూరకు బాగా సువాసన వస్తుంది.తర్వాత ఉప్పు వేసి, వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఎండు చేపల సారం వంకాయల్లోకి దిగి రుచి పెరుగుతుంది. పసుపు వేసి మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి. వంకాయలు, మగ్గాక కారం వేసి కలపాలి. కొద్దిసేపు ఉంచి ఒక కప్పు నీళ్లు పోయాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆపేయాలి.

పెసలు మసాలా కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!
పెసలు మసాలా కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!

ఈ కూర వేడిగా అన్నంతో, రొట్టెతో, రాగి సంగటితో కలిపి తింటే చాలా బాగుంటుంది. కొంతమంది కారం ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఎండు చేపలు ముందుగా వేరుగా వేయించి చివర్లో కలపవచ్చు, కానీ ఉల్లిపాయలతో కలిపి వేయించితే రుచి మరింత బాగుంటుంది. ఎండు చేపలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా కడిగి, వేయించి చేస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచి వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ప్లేటు ఖాళీ కాకుండా ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+