ఫ్యాటీ లివర్ కు చెక్ పెట్టే ఆకుపచ్చని శాకాహార మంత్రం!

ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. లివర్ లో కొవ్వు ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ అనేది ఒక జబ్బు. అయితే ఫ్యాటీ లివర్ సమస్యను పట్టించుకోకపోతే అది తీవ్రతరమై ప్రాణాల మీదకు తీసుకు రావచ్చు.

ఫ్యాటీ లివర్ సమస్య కు చెక్ పెట్టే ఆహారం ఇదే

ఫ్యాటీ లివర్ సమస్యను వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని తగ్గించుకోవడం మాత్రమే కాకుండా, ఆహారంలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి అది తగ్గడానికి శాకాహార భోజనం బాగా ఉపయోగపడుతుంది. శాకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. కేవలం శాకాహార భోజనం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే, మంచి ఆహారపు అలవాట్లను చేసుకుంటే ఫ్యాటీ లివర్ నుండి బయటపడవచ్చు.

Vegetarian Diet best For Fatty Liver Disease management

వీటితో ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది

ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, గింజలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు కొవ్వు మరియు చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు శాకాహార భోజనంలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి, శాకాహార భోజనం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్న వారిలోనూ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి.

బరువు కంట్రోల్ లో ఉంటే ఫ్యాటీ లివర్ సమస్య రాదు

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఫ్యాటీ లివర్ సమస్యను పరిష్కరిస్తుంది. ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చి తీరుతుంది. శాకాహార ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆహారంలో కొంత తిన్నప్పటికీ తృప్తిని కలిగించి బరువు తగ్గడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. బరువు తగ్గడం కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం

శాకాహార భోజనంలో ప్రోటీన్లు, ఐరన్ ను విటమిన్ బి12 వంటి పోషకాలు ఎక్కువగా తీసుకుంటే అది మీ కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. గింజలు, బీన్స్, పెసలు, నట్స్, సీడ్స్ ఇలా మంచి సమతుల పోషకాహారం ఫ్యాటీ లివర్ సమస్యను పరిష్కరించడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+