వెల్లుల్లి ఊరగాయ.. ఇలా చేసుకుని వేడి అన్నంలో తింటే అమోఘం!

ఇంట్లో ఊరగాయలు లేకుండా భోజనం అసంపూర్ణంగా అనిపిస్తుంది. మామిడికాయ, చింతకాయ, టమాటా ఊరగాయలు అందరూ పెడతారు. కానీ అవే తిని తిని విసిగిపోతారు. అలాంటప్పుడు కారం కారంగా, ఘాటుగా ఉండే వెల్లుల్లి ఊరగాయ ఒకసారి తయారు చేసుకు తింటే చాలా బాగుంటుంది. రుచికి అద్భుతం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఈ ఊరగాయ కాస్త తింటే త్వరగా ఉపశమనం కనిపిస్తుంది.

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కారం, నిమ్మరసం కలిపి తయారు చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

vellulli nilva pachadi Homemade Spicy Garlic Pickle Recipe - Easy and Flavourful Vellulli Ooragaya

కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి రెబ్బలు - 2 కప్పులు( ఒలిచి ఉండాలి)
నిమ్మరసం - అర కప్పు కంటే కాస్త ఎక్కువ
ధనియాలు - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీ స్పూన్
మెంతులు - 1 టీ స్పూన్
పసుపు - చిటికెడు
కారం పొడి - 4 టీ స్పూన్లు
ఎండు మిర్చి - 1 లేదా 2
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా మసాలా పొడి తయారు చేసుకోవాలి. పాన్‌లో జీలకర్ర వేసి కాస్త వేయించి తీసేయండి. తర్వాత మెంతులు, ధనియాలు, ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. వీటిని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.ఇప్పుడు మరో పాన్‌లో నూనె పోసి బాగా వేడి చేయండి. అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మధ్యమంట మీద బాగా వేయించాలి. వెల్లుల్లి లేత గోధుమ రంగులోకి వచ్చి సువాసన వచ్చే వరకు వేయించండి.

ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం పొడి వేసి కలపండి. .ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసి మరో 4-5 నిమిషాలు బాగా కలపండి. మంటను ఆర్పేయండి. ఆపై నిమ్మరసం పోయాలి. నిమ్మరసం వేసిన తర్వాత చల్లారిన మిశ్రమాన్ని శుభ్రమైన, పొడి సీసాలో నిల్వ చేసుకోండి.ఈ ఊరగాయను అన్నంతో, చపాతీతో, దోసెతో ఏదైనా కలిపి తినవచ్చు. దగ్గు, జలుబు ఉన్నప్పుడు కొద్దిగా తీసుకుంటే ఎంతో మేలు.

వంకాయ ఎండు చేపల కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది!
వంకాయ ఎండు చేపల కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది!

నూనె ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.వెల్లుల్లి ఊరగాయ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. శీతాకాలంలో ఇలాంటి ఘాటైన పచ్చళ్లు ఎక్కువగా పెట్టుకుంటే జలుబు, దగ్గు దూరంగా ఉంటాయి. ఒక్కసారి తయారు చేసి చూడండి, ఇంట్లో అందరూ అమోఘం అంటూ మెచ్చుకుంటారు. ఇష్టంగా తింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+