Green chillies: ప్రతీరోజూ పచ్చి మిరపకాయలు తింటే ఏమవుతుంది?
ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడానికి అన్ని రకాల కూరగాయలను తింటారు. అయితే కూరగాయలతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడంలో పచ్చిమిర్చి కూడా కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ నిత్యం తమ భోజనంలో పచ్చిమిరపకాయలను ఉండేలా చూసుకుంటే ఇది మీ చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతారు.
పచ్చి మిర్చితో చర్మ ఆరోగ్యం
పచ్చిమిరపకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని, ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని, చర్మానికి మేలు చేస్తుందని చెబుతారు. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చెబుతారు. పచ్చి మిర్చి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుంది. చర్మం మీద ముడతలు తగ్గించటంలో పచ్చి మిర్చి ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు.

గుండె ఆరోగ్యం, శరీర జీవక్రియకు బెస్ట్
పచ్చి మిరపకాయలు తింటే రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని, కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని, గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. పచ్చిమిరపకాయలు విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ల ముఖ్యమైన పోషకాలతో మన శరీరానికి మేలు చేకూరుస్తాయని చెబుతారు. పచ్చిమిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయం చేస్తుందని, పచ్చిమిరపకాయలను తినడం వల్ల శరీర జీవక్రియ రేటు పెరిగి కొవ్వు తగ్గడానికి దోహదం చేస్తుందని చెబుతారు.
పచ్చి మిర్చి తో బరువుకు చెక్
పచ్చిమిర్చి తింటే బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుందని చెబుతారు.పచ్చి మిర్చి మనకు సహజ నొప్పుల నివారిణిగా ఉపయోగపడుతుందని అంటారు. అయితే పచ్చిమిరపకాయలను అతిగా తినడం మంచిది కాదని, పచ్చిమిరపకాయలను పరిమితంగా తినడం మనకు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని అంటారు.
అతిగా తింటే అనర్ధం.. ఇలా తింటే బెనిఫిట్
పచ్చిమిరపకాయలు ఆరోగ్యానికి మంచిదని, అతిగా తింటే అనవసరంగా కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని అందుకే అతిగా తినకూడదని సూచిస్తున్నారు. ప్రతిరోజు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. పచ్చి మిర్చి మితంగా తింటే ఎటువంటి హాని జరగదని అలా కాకుండా ఎక్కువ పచ్చిమిరపకాయలు తింటే కడుపులో మంట జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications