వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడిగుడ్డులో ఉండే బ్యాక్టీరియా గురించి తెలుసా: తెల్లసొన తినడం వల్ల లాభమా? నష్టమా?

|
Google Oneindia TeluguNews

కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం. మార్కెట్‌లో పేదలు నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ధరలో లభించే పౌష్టికాహారం ఇది. తెల్లసొన, పచ్చసొన కాంబినేషన్‌ ఉంటుంది. ఇందులో చాలామంది తెల్లసొనను తినడానికి ఇష్టపడరు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని అభిప్రాయం ప్రజల్లో ఉంది. గుండెకు అంత మంచిది కాదని చెబుతుంటారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి.

గుడ్డు కాంబినేషన్ ఎలా ఉంటుంది?

గుడ్డు కాంబినేషన్ ఎలా ఉంటుంది?

కోడిగుడ్డులో ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు కలిగించేవే. కోడిగుడ్డులో అధిక వాటాను కలిగి ఉండేది తెల్లసొనే. గుడ్డు పైపొర 11 శాతం, పచ్చసొన 33 శాతం ఉంటుంది. తెల్లసొన 56 శాతం. నీరు, ప్రొటీన్ల కాంబినేషన్ ఇది. కండరాలు బలపడటానికి అవసరం అయ్యే ప్రొటీన్ల శాతం కోడిగుడ్డులో అధికంగా ఉంటుంది. అందుకే అథ్లెట్లు, బాడీ బిల్డర్లకు ఇది ప్రధాన ఆహారంగా మారింది.

సాల్మోనెల్లా బ్యాక్టీరియా..

సాల్మోనెల్లా బ్యాక్టీరియా..

ఉదయం లేవగానే నాటు కోడిగుడ్డును తాగే అలవాటు వారిలో చాలామందికి ఉంటుంది. క్రీడారంగంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ పచ్చిగుడ్డును తాగడానికి ఇష్టపడతారు. పచ్చి కోడిగుడ్లల్లోసాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కొంతవరకు ఇది హానికారకం. చెడిపోయిన కోడిగుడ్డులో ఈ బ్యాక్టీరియా శాతం అధికంగా ఉంటుంది. దాన్ని తిన్న తరువాత ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లోగా అది మన శరీరంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, తరచూ డాక్టర్లను సంప్రదించే వారు ఈ బ్యాక్టీరియాకు దూరంగా ఉండాలి.

 సాల్మోనెల్లా వల్ల కలిగే అనారోగ్య లక్షణాలు ఏంటీ?

సాల్మోనెల్లా వల్ల కలిగే అనారోగ్య లక్షణాలు ఏంటీ?

సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల వాంతులు అవుతాయి. జ్వరం వస్తుంది. డయేరియా సంభవించే ప్రమాదం ఉంది. పొత్తికడుపులో నొప్పి మొదలవుతుంది. అందుకే- పచ్చి కోడిగుడ్లను తాగడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్త చేస్తుంటారు నిపుణులు. సగం ఉడికించిన కోడిగుడ్లను తినడం కూడా మంచిది కాదు. అథ్లెట్లు, బాడీ బిల్డర్లకు ఇది మినహాయింపు. ఎందుకంటే- తమ శరీర దారుఢ్యం కోసం చేసే విపరీతమైన ఎక్సర్‌సైజుల వల్ల ఆ బ్యాక్టీరియా ప్రభావం పెద్దగా కనిపించదనేది వారి అంచనా. పూర్తిగా ఉడికించిన గుడ్లను మాత్రమే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

 తెల్లసొనలో ఉండే న్యూట్రీషియన్లు ఏంటీ?

తెల్లసొనలో ఉండే న్యూట్రీషియన్లు ఏంటీ?

అరకప్పు తెల్లసొనను ప్రాతిపదినగా తీసుకుంటే- అందులో ఉండే న్యూట్రీషియన్ల కాంబినేషన్లు శరీరానికి మేలు చేసేవే. క్యాలరీస్-54, ప్రొటీన్లు-11 గ్రాములు, పొటాషియం-152 మిల్లీగ్రాములు, సోడియం-163 గ్రాములు ఉంటాయి. కొవ్వు అసలు ఉండదు. తెల్లసొనలో ఉండే కొలెస్ట్రాల్ శాతం జీరో. ఇవి మన శరీరంలోని ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి. సాధారణంగా వయస్సు మల్లిన వారిలో ఎముకలు కాస్త బలహీనంగా ఉంటాయి. వారు ప్రతిరోజూ కోడిగుడ్డును తినడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.

ప్రతి రోజూ అవసరమే..

ప్రతి రోజూ అవసరమే..

రెకమెండెడ్ డెయిలీ అలవెన్స్ (ఆర్డీఏ) కింద ప్రతిరోజూ 0.36 గ్రాముల మేర తెల్లసొనను తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను నిరోధించవచ్చని చెబుతుంటారు. కొలెస్ట్రాల్ శాతాన్ని సైతం తెల్లసొన తగ్గించగలుగుతుంది. 88 మంది హై కొలెస్ట్రాల్ ఉన్న వారు ప్రతిరోజూ 4 నుంచి 8 గ్రాముల వరకు తెల్లసొనను తీసుకోవడం వల్ల- ఎనిమిది వారాల తరువాత దాని శాతం గణనీయంగా తీగ్గినట్టు శాస్త్రీయబద్ధంగా నిరూపితమైందని నిపుణులు చెబుతున్నారు.

English summary
Because egg whites are a trusted source of muscle-building protein, some people — especially athletes and bodybuilders drink them. And many prefer to drink them raw.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X