హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ న్యాయస్థానాల్లో 4600 ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతున్నాయి. మరో వైపు కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదాలు లభిస్తున్నాయి. తాజాగా, మరో 4600కుపై ఉద్యోగాలకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు రాష్ట్రంలోని వివిద కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లయింది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

Telangana government green signal to fill 4600 posts in courts

బీసీ గురుకులాల్లో 2591 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదలవుతున్నాయి. తాజాగా, బీసీ గురుకులాల్లో 2591 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.బీసీ సంక్షేమ శాఖ, జ్యోతిబా పూలే బీసీ విద్యాసంస్థలకు పోస్టులు మంజూరు చేసింది. దీంతోపాటు 33 రెసిడెన్షియల్ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆమోదం లభించింది.

కొత్తగా ప్రారంభించిన కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నాలుగు జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

ఇది ఇలావుండగా, ఆర్ అండ్ బీ శాఖలో అదనపు ఉద్యోగ నియామకాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీలోని పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. 28 డీఏ ఆఫీసర్, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది.

English summary
Telangana government green signal to fill 4600 posts in courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X