Railway University: మన దేశంలో రైల్వే యూనివర్సిటీ ఉందని తెలుసా?

సాధారణంగా మనకు ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ లేదా లా లాంటి రంగాలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఉండటం తెలుసు. కానీ, భారత రైల్వే వ్యవస్థతో పాటు రవాణా రంగానికి మాత్రమే కేటాయించిన ఒక ప్రత్యేక సెంట్రల్ యూనివర్సిటీ మన దేశంలో ఉందనే విషయం చాలామందికి తెలియదు. గుజరాత్‌లోని వడోదర కేంద్రంగా పనిచేస్తున్న 'గతి శక్తి విశ్వవిద్యాలయం' దీనికి నిదర్శనం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ విశ్వవిద్యాలయం రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో విప్లవాత్మకమైన శిక్షణను, పరిశోధనలను అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రైల్వే ఇన్‌స్టిట్యూట్ నుంచి సెంట్రల్ వర్సిటీ వరకు..

గతంలో 'నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్' గా ఉన్న ఈ సంస్థ రూపురేఖలను మార్చుకుంటూ 2022లో 'గతి శక్తి విశ్వవిద్యాలయ చట్టం' ద్వారా పూర్తిస్థాయి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. కేవలం రైల్వే సర్వీసులకే పరిమితం కాకుండా ఏవియేషన్, షిప్పింగ్, నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు , లాజిస్టిక్స్ లాంటి సమగ్ర రవాణా వ్యవస్థలన్నింటినీ కవర్ చేస్తూ ఉన్నత విద్యను అందిస్తుండటం దీని ప్రత్యేకత.

Did You Know India Has A Railway University Check Courses Fees and Admission at Gati Shakti Vadodara

కోర్సుల్లో స్పెషలైజేషన్లు.. బీటెక్ స్థాయి నుంచే శిక్షణ!

ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ వర్సిటీలో బీటెక్ స్థాయిలో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ విభాగాల్లో బీటెక్ చదువుతూనే 'రైల్ ఇంజనీరింగ్' స్పెషలైజేషన్ పొందే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగానికి సంబంధించి ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ , అవియేషన్ ఇంజనీరింగ్‌లలో ప్రత్యేక బీటెక్ డిగ్రీలను ఈ విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తోంది. యూజీతో పాటు పీజీ స్థాయిలోనూ పలు కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

జేఈఈ మెయిన్ ద్వారా అడ్మిషన్లు.. ఫీజుల వివరాలు ఇవే!

ఈ విశ్వవిద్యాలయంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు జేఈఈ మెయిన్ (JEE Main 2026) అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జోసా (JoSAA) లేదా సిఎస్‌ఏబి (CSAB) కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు. ఫీజుల విషయానికొస్తే, డే స్కాలర్ విద్యార్థులకు మొదటి ఏడాది బీటెక్ రుసుము రూ. 1,76,600 గా నిర్ణయించారు.

ఒకవేళ హాస్టల్ వసతి పొందే విద్యార్థులైతే మెస్ ఛార్జీలతో కలిపి మొదటి ఏడాదికి రూ. 2,66,200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిభావంతులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కుటుంబ ఆదాయాన్ని బట్టి వర్సిటీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+