హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్‌న్యూస్: 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు అనుమతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయి.

కాగా, ఇటీవల భారీ ఎత్తున గ్రూప్ 4 పోస్టలు భర్తీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 9168 పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం గమనార్హం. ఈ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తే తాము కూడా ఉద్యోగాలను సాధించేందుకు మరింతగా శ్రమిస్తామని ఉద్యోగార్థులు చెబుతున్నారు.

 Telangana Govt green signal to fill 9168 group-4 posts.

త్వరలోనే పోలీస్ విభాగంలోనూ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 17వేలకుపైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ శాఖలో మరో 2వేల పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.

ఇది ఇలావుండగా, రాష్ట్ర పాఠశాఖ విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్-1 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్‌ లెక్చరర్ల పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచారు.

English summary
Telangana Govt green signal to fill 9168 group-4 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X