హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో మంచి వార్త అందించింది. రాష్ట్రం కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే 9096 పోస్టులున్నాయి. బీసీ గురుకులాల్లో 3870, గిరిజన గురుకులాల్లో 1514, ఎస్సీ గురుకులాల్లో 2267 పోస్టులు ఉన్నాయి.

కాగా, ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక, ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశుసంక్షేమ శాలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగుల శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

Telangana govt permission to replace 10,105 more jobs in the state

మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు.

కొందరు చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లా మాత్రమేనని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు హరీశ్ రావు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని మంత్రి వెల్లడించారు.

English summary
Telangana govt permission to replace 10,105 more jobs in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X