హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రూప్​-4 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 9 వేలకుపైగా పోస్టుల కోసం అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్య గమనిక ఇది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులు నేటి నుంచి గ్రూప్-4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్ 4 దరఖాస్తులను స్వీకరించనున్నారు.

గ్రూప్-4 విభాగంలో రాష్ట్రంలోని 25 విభాగాల్లోని 9,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 6,859 జూనియర్ అసిస్టెంట్, 429 జూనియర్ అకౌంటెంట్, 18 జూనియర్ ఆడిటర్, 1862 వార్డు అధికారులు పోస్టులు భర్తీ కానున్నాయి. జనవరి 19 వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Group-4 application process started from December 30th

గ్రూప్-4 మొత్తం ఉద్యోగాలు: 9168
జూనియర్ అసిస్టెంట్: 6859
జూనియర్ అకౌంటెంట్: 429
జూనియర్ ఆడిటర్: 18
వార్డు అధికారులు: 1862

మరోవైపు, త్వరలోనే మరో 4 ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తులు పూర్తి చేసింది. గ్రూప్-3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటవీ బీట్ అధికారి, డిగ్రీ లెక్చరర్, సహాయ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది.

783 గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 783 పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-2లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు(ఏఎస్ఓ) 165, మండల పంచాయతీ అధికారులు 126, నాయబ్ తహసీల్దారు 98, ప్రొబేషనరీ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 97 ఉన్నాయి.

English summary
Telangana Group-4 application process started from December 30th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X