హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల: 1326 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు నుంచి మరో తీపి కబురు అందింది. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక మండలి నోటిఫికేసన్ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.

Telangana: notification released for replacement of 1326 jobs in the department of health

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu OneIndia

టెట్ కీ విడుదల

మరోవైపు, తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2022 ప్రాథమిక సమాధానాలు విడుదలైంది. tstet.cgg.gov.inలో టెట్ ప్రాథమిక కీ ఉన్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. సమాధానాలపై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. జూన్‌ 18లోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు. కాగా, టెట్ పరీక్ష జూన్ 12న నిర్వహించారు. టెట్‌​కు 90శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 27న టెట్ ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

English summary
Telangana: notification released for replacement of 1326 jobs in the department of health
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X