హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్: హైకోర్టు తీర్పు అమలు చేస్తున్న టీఎస్ఎల్ఆర్బీ

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించింది.

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయనుంది టీఎస్‌ఎల్పీఆర్‌బీ. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహధారుడ్య పరీక్షలు నిర్వహంచనున్నారు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్ టికెట్ నెంబర్లతో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు.

 TSLPRB key decision on si and constable preliminary exam results

తాజాగా, హైకోర్టు తీర్పు అమలుతో మరికొందరు తర్వాత దశకు ఎంపిక కానున్నారు. అదనంగా ఎంపికయ్యేవారి వివరాలు రేపట్నుంచి వెబ్‌సైట్‌లో లభ్యం కానున్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ లోపు హాల్ టికెట్ నెంబర్లతో లాగిన్ కావాలని, పార్ట్-2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని బోర్డు తెలిపింది.

ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు దేహదారుఢ్య పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.
ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

English summary
TSLPRB key decision on si and constable preliminary exam results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X