వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆ మీటను ఎవరు నొక్కుతారు...
ఒక కోటీశ్వరుడికి కొడుకంటే ప్రాణం. ఏదడిగినా ఇస్తుండటంతో ఆ కొడుకు పరమ బద్దకస్తుడిగా తయారయ్యాడు.
బద్దకం కారణంగా కొడుకు తిండి కూడా సరిగా తినకపోవడం వల్ల తండ్రి కొడుకుకు ఒక యంత్రం కొనిపెట్టాడు.
‘ఇదిగో ఈ ఎర్ర మీట నొక్కితే ఇద్దరు వచ్చి భోజనం వడ్డిస్తుంది. ఈ నీలం మీట నొక్కితే ఆయా వచ్చి ఏం కావాలన్నా చేస్తుంది' అన్నాడు.
కొడుకు అంతా విని ‘అది సరే నాన్నా ... మరి ఈ మీటలన్నీ నొక్కడానికి ఎవరు వస్తారు?' అని అడిగాడు
-----------------
"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి.
"అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త.