వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 వస్తువులుంటే ఆర్థికంగా ఎప్పుడూ వెనకబడరు!
వాస్తు ప్రకారం ఇల్లు నిర్మిస్తే సంపద, శ్రేయస్సు, ఆనందం, సంతోషం ఉంటాయని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఎంతో జాగ్రత్తగా ఇంటి నిర్మాణంలో వాస్తును అన్వయిస్తారు. అయితే కీర్తి, ఆనందం ఉండాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే నాలుగు వస్తువులు ఇంట్లో ఉండాలి. లేదంటే ఆ తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తుందంటారు.
ఆహారానికి రుచినిచ్చే ఉప్పు కచ్చితంగా ఉండాలి. వంటగదిలో ఉప్పు లేకపోతే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఆహారంలో ఉప్పు లేనప్పుడు లేదా తక్కువైనప్పుడు ఏవిధంగానైతే రుచిని కోల్పోతారో జీవితం కూడా అలాగే అవుతుంది. అందుకే ఉప్పు కచ్చితంగా ఉంచుకోవాలి.

గోధుమపిండిని అయిపోకుండా చూసుకోవాలి. లేదంటే రొట్టెల్లాంటివి చేసుకోలేం. కొన్ని కొన్నిసార్లు ఇంట్లో నెలాఖరులో పిండి అయిపోతుంటుంది. దీన్ని గమనించి కనీసం 100 గ్రాముల పిండినైనా తెప్పించి ఇంట్లో ఉంచుకోవాలి. ఉత్తర భారతీయులు గోధుమ పిండిని ఎక్కువగా వాడితే దక్షిణ భారతీయులు బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేకుండా ఇల్లు ఉండకూడదు.
వంటగదిలో బియ్యం ఎప్పుడూ ఉండాలి. అవి ఆహారమే కాదు.. పూజలో కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో బియ్యం అయిపోతే సంపదకు కారకుడయ్యే శుక్రుడు ప్రభావితమవుతాడు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో పసుపు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. కూరల్లోనే కాకుండా శుభకార్యాలకు కూడా వాడతారు. ఎప్పుడూ పసుపు ఇంట్లో లేకుండా ఉండకూడదు. అయిపోతే వెంటనే తెప్పించుకోవాలి.
ఈ నాలుగు పదార్థాలు ఇంట్లో ఎప్పుడూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రవాహం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి ఇంట్లో ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాకపోతే పొరపాటున అయిపోయినప్పుడు కొంతమంది మహిళలు వంటగదిలో చూడలేరు. అయిపోతున్న విషయాన్ని గమనించి కొంచెం ఉన్నప్పుడే తెప్పించుకుంటే చాలా మంచిది.












Click it and Unblock the Notifications