ఆకట్టుకున్న బోల్డ్ అండ్ ఎమోషనల్ రివేంజ్ డ్రామా

నేటితరం ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా బోల్డ్, థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ సినిమాలో రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Toxic Censor Review: సినిమా టాక్ ఇదే.. హిట్టా..? ఫట్టా..?
Toxic Censor Review: సినిమా టాక్ ఇదే.. హిట్టా..? ఫట్టా..?

కథ

అరిజోనాలోని ఒక పబ్ చుట్టూ ఈ కథ అంతా తిరుగుతుంది. దాన్ని నడిపించే మైక్ అత్యంత క్రూరుడైన సైకో. అమ్మాయిలను దారుణమైన వ్యాపారంలోకి దింపి డబ్బు సంపాదించడం, ఒక ఐలాండ్‌లో వంద కోట్ల విలువైన రిసార్ట్, పబ్‌లను నిర్మించడమే అతని ఏకైక లక్ష్యం. ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకపు అమ్మాయిలను తన చీకటి ఊబిలోకి లాగుతాడు. అలాంటి పరిస్థితుల్లో విన్ని (రాధ్య) అనే యువతి ఈ వ్యాపారంలోకి రావాల్సి వస్తుంది. అదే సమయంలో భారత్ నుంచి ఈషా, ఈవ్, బేబ్ అనే మరో ముగ్గురు అమ్మాయిలు కూడా అక్కడికి చేరుకుంటారు.

The Red Bag Movie Review amp amp Rating A Bold Emotional Revenge Thriller

అసలు వీరు ఇండియాను వదిలి అరిజోనాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? క్రూరుడైన మైక్ బారి నుంచి ఈ నలుగురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ కథలో 'రెడ్ బ్యాగ్' వహించిన అత్యంత కీలకమైన పాత్ర ఏంటి? చివరకు తమ కష్టాలను అధిగమించి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్

దర్శకుడు రవి కుమార్ సీరపు రెగ్యులర్ రివేంజ్ లైన్‌నే ఎంచుకున్నా, ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు స్టైలిష్ మేకింగ్‌తో ప్రెజెంట్ చేశారు. 'బ్యాక్ అండ్ ఫోర్త్' స్క్రీన్‌ప్లేతో ఫ్లాష్‌బ్యాక్ సీన్లను ఆసక్తికరంగా డిజైన్ చేయడం సినిమాకు ప్రధాన బలంగా మారింది. విన్ని పాత్రలో రాధ్య తన నటనతో ఆకట్టుకోగా, మిగిలిన ముగ్గురు కథానాయికలు గ్లామరస్ లుక్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించారు. కబీర్ సింగ్ తన విలనిజంతో భయపెట్టగా, ప్రసాద్ బెహరా తన మార్క్ కామెడీతో నవ్వించారు. నటి రాశి తన పరిమిత పాత్రలోనే బలమైన ఇంపాక్ట్ చూపించారు. ప్రథమార్థంలో ఎమోషన్స్ ప్రధానంగా సాగితే, ద్వితీయార్థంలో వచ్చే ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఒక తల్లి ఆవేదనను, ఆమె కోసం కూతుళ్లు చేసే పోరాటాన్ని సున్నితంగా చూపించిన తీరు కనెక్ట్ అవుతుంది.

5 రోజులు ఆడిన మహేష్ బాబు సినిమా ఉంది తెలుసా?
5 రోజులు ఆడిన మహేష్ బాబు సినిమా ఉంది తెలుసా?

సాంకేతిక వర్గం

విజువల్స్ పరంగా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. కెమెరా వర్క్, సన్నివేశాల మూడ్‌ని పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్. పబ్ సాంగ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. హరికృష్ణ సోమిశెట్టి పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

ఫైనల్‌గా

గ్లామరస్ కాస్ట్యూమ్స్, బోల్డ్ క్యారెక్టరైజేషన్లతో కథ మొదలైనా.. అంతిమంగా సమాజానికి మేలు చేసే 'రాబిన్ హుడ్' తరహా లక్ష్యంతో ముగిసే పర్ఫెక్ట్ రివేంజ్ ఎమోషనల్ డ్రామా ఈ 'ది రెడ్ బ్యాగ్'. థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

రేటింగ్: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+